Sydney Sweeney Bollywood Offer:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఇండియాకు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ సినిమాలో ఆమె నటించడానికి ఏకంగా రూ.530 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.
ఇండియన్ సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతోంది. గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఇప్పటికే ఎంతో మంది హాలీవుడ్ యాక్టర్స్ భారతీయ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించారు. తాజాగా మరో హాలీవుడ్‌లో పాపులర్ స్టార్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఫారెన్ బ్యూటీస్ మన సినిమాలో నటించడం కామనే. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? హాలీవుడ్ స్టార్ ఇండియన్ సినిమాల్లో నటించడం కొత్తేమి కాకున్న ఈ అమ్మడు అందుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు?
25
సిడ్నీ స్వీనీ – ఎవరు?
బాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా స్టోరీ డిమాండ్ చేయడంతో సిడ్నీ స్వీనీ అనే హాలీవుడ్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మూవీకి క్రేజ్ పెరిగింది. దాంతో సిడ్నీ స్వీనీ ఎవరు? ఆ బ్యూటీ బ్యాక్ డ్రాప్ ఏంటీ? అని మూవీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. సిడ్నీ స్వీనీ పూర్తి పేరు సిడ్నీ బెర్నీస్ స్వీనీ. ఈ అమెరికా అమ్మడుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ఉంది. ఎవ్రీథింగ్ సక్స్ (Everything Sucks), ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్ ( The Handmaid’s Tale), షార్ప్ ఆబ్జెక్ట్స్ ( Sharp Objects)వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
35
హాలీవుడ్ స్టార్ హీరోయిన్
క్వెంటిన్ టారాంటినో రూపొందించిన వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ (Once Upon a Time in Hollywood)సినిమాలో నటించి హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే యూపోరియా (Euphoria)అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ నటించింది. ఇటీవల ఆమె నటించిన ది వైట్ లోటస్ (The White Lotus) కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన క్రిస్టీ ( Christy)అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె లేడీ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బెన్ పోస్టర్, మెర్రిట్ వీవర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పలు కథనాల ప్రకారం.. ఇండియాకు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఒక కొత్త ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ సిద్దమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు సిడ్నీ స్వీనీని సంప్రదించారు. ఈ సినిమా స్టోరీ ప్రకారం ఒక అమెరికన్ యువతి భారతీయ యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆ పాత్రకు సరిపోతుందని భావించి సిడ్నీని ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల పేర్లను గోప్యంగా ఉంచారు. కానీ ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద బడ్జెట్‌తో తెరకెక్కబోతుందట. ఈ సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్‌లతో సహా పలు నగరాల్లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
55
భారీ రెమ్యునరేషన్ – ఊహించని ఆఫర్
ఈ భారీ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో సినిమా మీద క్రేజ్ మరింత పెరిగింది. సన్ మ్యాగజైన్ కథనం ప్రకారం, ఈ చిత్రానికి సిడ్నీ స్వీనీకి ఆఫర్ చేసిన పారితోషికం వినగానే షాక్ అవ్వాల్సిందే. రెమ్యునరేషన్ 35 మిలియన్ పౌండ్స్ (భారతీయ కరెన్సీలో దాదాపు ₹415 కోట్లు), స్పాన్సర్‌షిప్ ప్యాకేజీలు: 10 మిలియన్ పౌండ్స్ (భారతీయ కరెన్సీలో ₹115 కోట్లు) మొత్తంగా ఈ సినిమా ద్వారా సిడ్నీ స్వీనీకి దాదాపు ₹530 కోట్ల రెమ్యునరేషన్ లభించనుంది. ఈ ప్రాజెక్ట్ నిజమైతే.. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్‌గా సిడ్నీ స్వినీ నిలుస్తుంది.
భారతీయ సినిమా గ్లోబల్ లెవెల్‌కి చేరిందని, అంతర్జాతీయ స్థాయి నటులు కూడా ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో భాగమవుతున్నారని సిడ్నీ స్వీనీ ఎంట్రీ మరోసారి రుజువు చేస్తోంది. ఆమెకు ఆఫర్ చేసిన భారీ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.