HIT 3 Movie Review, రఫ్ అండ్ టఫ్ పోలీస్ గా నాని ఎలా ఉన్నాడు, హిట్ 3 హిట్టా ఫట్టా

Published : May 01, 2025, 03:38 PM ISTUpdated : May 01, 2025, 06:05 PM IST

HIT 3 Movie Review : అప్పటికే హిట్ సీక్వెల్ లో రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సాధారణంగానే పార్ట్ 3 పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా హిట్ సీక్వెల్స్ కు నిర్మాతగా ఉన్న హీరో నాని.. ఈసారి డైరెక్ట్ గా రంగంలోకి దిగి హిట్ 3 లో చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. మరి ఈ పాత్ర నానికి ఎంత వరకూ సూట్ అయ్యింది. హిట్ 3 హ్యాట్రిక్ హిట్ అందించిందా లేక ఫట్ అయ్యిందా? హిట్ 3 మూవీ రివ్యూ లో ఇతర విషయాలు తెలుసుకుందాం?

PREV
16
HIT 3 Movie Review, రఫ్ అండ్ టఫ్ పోలీస్ గా నాని ఎలా ఉన్నాడు, హిట్ 3 హిట్టా ఫట్టా
Two young Heros in Nani HIT 3 in telugu

కథ:
కథ విషయానికి వస్తే.. అర్జున్‌ సర్కార్ అలియాస్ నాని చిన్నప్పుడు తల్లిని కోల్పోయి చాలా  కఠింగా తయారు అవుతాడు. ఎక్కడా ఎమోషన్స్ కు, ఫీలింగ్స్ కు స్పేస్ ఇవ్వకుండా.. సీరియస్ గా ఉంటుంటాడు. తప్పు చేస్తే..  చట్టం కాకుండా స్వయంగా శిక్ష విధించే టైప్ పాత్ర నానిది. ఇక ఈ సొసైటీలో నేరం చేయాలి అంటే భయపడాలి, ఓక్క  నేరస్తుడికైనా చోటుండకూడదనే లక్ష్యంతో పనిచేస్తుంటాడు.  నేరం చేసి నాని చేతికి చిక్కితే.. ఇక వాళ్ళకు నరకమే. 

నేరగాళ్లకి నరకం చూపించే  అర్జజున్ సర్కార్  దృష్టికి  ఓ సైకో కిల్లర్ కేసు తగులుతుంది. ఆ సైకో  వరుస హత్యలతో పోలీస్ వ్యవస్థకు సవాల్ విసురుతుంటాడు. ఈకేస్ ను అర్జున్ ఎలా డీల్ చేస్తాడు అనేది సినిమా. అయితే ఈ సీరియస్ పరిస్థితుల్లో అర్జున్ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది.

మృదుల అలియాస్ శ్రీనిధి శెట్టి అర్జున్ జీవితంలోకి అడుగుపెడుతుంది. అసలు మృదుల ఎవరు? ఆమె అర్జున్ సర్కార్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆ సైకోకిల్లర్ ఎవరు అనేది తెలియాలంటే హిట్ 3 చూడాల్సిందే. 

26
Actor Nanis Hit 3 film poster getting fans attention

సినిమా  విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకులు పాత కథలకే అద్భుతమైన కొత్త స్క్రీన్ ప్లేలు అల్లి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు హిట్ 3 కథ కూడా పాతతే. కాని ఈసినిమాను ప్రజెంట్ చేసిన విధానం మాత్రం అద్భుతంగా ఉంది.  దర్శకుడు శైలేష్ కొలను మరోసారి తన స్టైల్‌తో మెప్పించాడు. లవర్ బాయ్ గా ఉన్న నానిని అంత సీరియస్ పాత్రలో చూపించే ధైర్యం చేయడం నిజంగా గొప్పతనమే. అర్జున్ సర్కార్ అనే రఫ్ అండ్ టఫ్ పోలీస్ అధికారి జీవితం.. ప్రశ్నలతో కథ మొదలయ్యి.. వాటికి సమాధానాలు అల్లుతూ సినిమా సాగుతుంది. 
 

36
Nani starrer Hit 3 ott rights update

స్క్రీన్ ప్లే తోనే సినిమాను ఉత్కంఠగా మార్చేశాడు డైరెక్టర్. మొదటి భాగం అంతా ఇలానే ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ అయితే స్ట్రెయిట్ నేరేషన్ స్టార్ట్ అవుతుంది. విలన్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టి.. అక్కడ సమస్యలు అధిగమిస్తూ.. హీరో చేసిన సాహసాలు అద్భుతంగా అనిపిస్తాయి.  మాస్ ఆడియన్స్‌కి పక్కా ఫీస్ట్ లా అనిపిస్తాయి. అర్జున్ సర్కార్ పాత్ర ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. ఒక వైపు సినిమా అంత సీరియస్ గా కథ నడుస్తుండగానే ఇందులో  మరోవైపు చాగంటి గారి ప్రవచనాలు వినిపించడం సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చుతుంది. 

46
Hit 3 Teaser:

ఇక నటీనటుల విషయానికి వస్తే.. నాని అర్జున్ సర్కార్ పాత్రలో నిజంగా అద్భుతం చేశాడు. ఇప్పటి  వరకూ చూడని  ఓ డిఫరెంట్ నానిని ఇందులో చూస్తారు. మోనాటనీ అని అనేవారు నానిని ఈ పాత్రలో చస్తే నిజంగా థ్రిల్ అవుతారు.  

ఈమధ్య  నాని చేస్తున్న పాత్రలు విభిన్నంగా, విలక్షణంగగా ఉంటున్నాయి. ఇక అర్జున్ సర్కార్‌ పాత్ర యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటాడు. యాక్షన్, రొమాంటిక్ సీన్లలో నాని బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇక హీరోయిన్ గా కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఉన్నంతలో కనిపించనంత సేపు స్క్రీన్ చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది.

ఆమె మీద చూపు పక్కకు తిప్పుకోకుండా  చేసింది. గ్లామర్‌ మాత్రమే కాదు నటన విసయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు శ్రీనిథి. ఇక  కోమలి ప్రసాద్, రావు రమేష్, ఇతర పాత్రల్లో నటించిన వారంతా  తమ పాత్రల పరిదిమేరకు బాగా నటించారు. . ఇక ఈ సినిమాలో అతిథ పాత్రలు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. 
 

56
Nanis Hit 3 upcoming film update out

ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. దర్శకుడు శైలేష్ కొలను స్క్రీన్ ప్లేకు ఫిదా అయిపోవాల్సిందే.  సాన్ జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి బాగుంది.  మిక్కి జే మేయర్ బీజీఎం, రెండు పాటలు హైలెట్. కశ్మీర్, రాజస్థాన్‌లో సీన్లు ఆకట్టకుంటాయి.  కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. గత రెండు సినిమాల కంటే కూడా  హిట్ 3 ప్రొడక్షన్ వైజ్‌గా గ్రాండ్‌గా ఉంది.

66
Nani starrer Hit 3 collection report pre sale

ఇక ఓవర్ ఆల్ గా చూసుకుంటే  ఈమూవీలో మితిమీరిన హింస ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే వారు మాత్రం వెంటనే చూసేయండి. కాని పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్  మాత్రం ఈ సినిమా చూడలేరు అని చెప్పాలి. ఇక ఈసినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే నాని  పెర్ఫార్మెన్స్, స్క్రీన్‌ప్లే,బీజీఎం, పాటలు, ఇక మైనస్ విషయానికి వస్తే.. మితిమీరిన హింస, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, కొన్ని కనెక్టింగ్ లేని సీన్లు. 

రేటింగ్‌ః 3

Read more Photos on
click me!

Recommended Stories