అజిత్ కి వచ్చిన పుట్టినరోజు కానుక
ఈ సంవత్సరం కూడా అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన `బిల్లా`, `వీరం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తిరిగి విడుదల చేశారు. నటుడు అజిత్ కుమార్ కు ఈ సంవత్సరం పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఆయనకు పుట్టినరోజు కానుకగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా విజయం, కార్ రేస్ విజయం, ముఖ్యంగా పద్మ భూషణ్ అవార్డు వంటివి వరుసగా లభించాయి. ఇలా ఈ బర్త్ డే అజిత్‌కి చాలా స్పెషల్.