సినిమా వివాదాలు
తమిళ సినీ రంగంలో అజిత్ కు అప్పుడప్పుడు వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాకి ఒప్పుకుని, కొన్ని సమస్యల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. `నాన్ కడవుల్`, `గజిని` వంటి సినిమాలను మొదట అజిత్ చేయాల్సింది. కానీ దర్శకులతో విభేదాల వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయారు.
రాజకీయ ప్రకటన & బహిరంగ వ్యాఖ్యలు
అజిత్ ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. అయితే, రాజకీయ నాయకులనే తన మాటలతో భయపెట్టగలరు. ఒకసారి కలైజ్ఞర్ ముందు వేదికపై తనను బలవంతంగా ఈ వేడుకకు తీసుకొచ్చారని అజిత్ చెప్పడం పెద్ద దుమారం రేపింది.