Karthika Deepam: సూపర్ ట్విస్ట్: సౌందర్యకు ఫోన్ చేసిన జ్వాల.. నానమ్మ నేనే సౌర్య అంటూ షాక్!.

Published : May 18, 2022, 07:32 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: సూపర్ ట్విస్ట్: సౌందర్యకు ఫోన్ చేసిన జ్వాల.. నానమ్మ నేనే సౌర్య అంటూ షాక్!.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలో నిరూపమ్ (Nirupam) హిమ దగ్గర నుంచి వెళుతుండగా డాక్టర్ సాబ్ ఐ లవ్ యు అని గట్టిగా అరుస్తుంది. మరోవైపు హిమ (Hima)  హాస్పిటల్ కి వెళ్లగా అందరూ తననే గుచ్చిగుచ్చి చూస్తారు. దాంతో హిమ ఎందుకు నా వైపు అందరూ అలా చూస్తున్నారు అంటూ వాళ్ళ పై విరుచుకు పడుతుంది.
 

26

మరోవైపు జ్వాల (Jwala) సత్య కోసం అన్నం తీసుకుని వెళ్లి వడ్డిస్తూ ప్రస్తుతానికి నన్ను ఆటో నడిపే అమ్మాయిలా చూస్తున్నారు. మీ ఇంటి కోడలిగా ఒప్పుకుంటారా అని మనసులో అనుకుంటుంది. ఒక పక్క నిరూపమ్ హిమ (Hima) తో తనని చూడనట్టుగా తనని పట్టించుకోకుండా మాట్లాడకుండా హెల్త్ కి సంబంధించిన ఫైల్ చదువుతూ ఉంటాడు.
 

36

ఇక హిమ (Hima) నన్ను చూడు బావ అంటూ..  ఆ ఫైల్ లాగేసుకుంటుంది. దాంతో ఆ ఫైల్ లో ఉన్న హిమ ఫోటోలు బయట పడతాయి. మరోవైపు సౌందర్య కారులో హడావిడిగా వెళుతూ ఒక ముసలావిడను గుద్దుతుంది. వెంటనే సౌందర్య (Soundarya) ముసలావిడను హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది.
 

46

అంతే కాకుండా ఆమెకు అన్ని రకాలుగా సౌందర్య (Soundarya) సహాయం చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆ ముసలావిడ ఇంటికి సౌందర్య పండ్లు తీసుకుని వెళుతుంది. అది గమనించిన సౌర్య తను కూడా వాళ్ల నాన్నమ్మ ను ఫాలో అవుతుంది. ఇక సౌర్య (Sourya) కు అసలు విషయం తెలుస్తుంది.
 

56

ఇక సౌందర్య (Soundarya) ను ఆ ముసలావిడ ఎంతగానో మెచ్చుకుంటుంది.  కానీ జ్వాల (Jwala)  సౌందర్యను ఫన్నీ గా తీసి పారేస్తుంది. ఆ తర్వాత సౌందర్య సౌర్య ను కారులో ఒక దగ్గరకు తీసుకుని వెళుతుంది. మరోవైపు హిమ నేను చేసింది తప్పే బావ..  కానీ ఎందుకు చేశానో అడగవద్దు అని అంటుంది.
 

66

ఇక తరువాయి భాగంలో సౌందర్య (Soundarya) మీ నాన్న ఏం చేస్తాడు అని, వాడు ఒక మనిషా.. అమ్మాయి ఆటో నడుపుతుంటే.. ఏం చేస్తున్నాడు అని సౌర్య ను అడుగుతుంది. దాంతో సౌర్య (Sourya) ఏడుస్తుంది. ఆ తర్వాత సౌందర్య కు కాల్ చేసి నానమ్మ నేను సౌర్య ను అని అంటుంది. దాంతో సౌందర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories