Shruti Haasan Singing: ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాటను మాత్రం వదలను : శృతి హాసన్

Published : May 18, 2022, 07:15 AM IST

సౌత్ లో గ్లామర్ హీరోయిన్ గా.. రచ్చ రచ్చ చేస్తున్న శృతీ హాసన్.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నా సరే తనకు ఎంతో ఇష్టమైన పాటను మాత్రం వదిలిపెట్టేది లేదంటోంది. 

PREV
17
Shruti Haasan Singing: ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాటను మాత్రం వదలను : శృతి హాసన్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు నటనతో పాటు పాటలంటే కూడా ప్రాణం. గతంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ తో  పాటు ఫారెన్ లో తిరుగుతూ.. స్టేజ్ షోస్ ఇచ్చింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ.. పాటల వెంట పడింది శ్రుతి హాసన్. ఆతరువాత మళ్లీ  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. పాటలకు బ్రేక్ ఇచ్చింది శ్రుతి. 

27

ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ తో బ్రేక్ అప్ తరువాత బాగా అప్ సెట్ అయిన శృతి అప్పటి నుంచే పాటలకు కూడా బ్రేక్ ఇచ్చింది, అప్పటి వరకూ స్టేజ్ షోస్ తో ఫుల్ బిజీగా గడిపిన బ్యూటీ.. ఆతరువాత పాటల జోలికి వెళ్లలేదు. ఇక ఇప్పుడు తను పాటలను వదిలేసిందా..? అన్న ప్రశ్నకు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది చెన్నై చిన్నది. 

37

నటనతో పాటు సంగీతం కూడా నా జీవితంలో ఓ భాగం అంటోంది శృతి హాసన్. లండన్‌లోని వివిధ వేదికలపై పాటలు పాడాను. లాక్‌డౌన్‌ వల్ల లైవ్‌ మ్యూజిక్‌ చేసే వీలులేకుండా పోయింది. భవిష్యత్తులో నటనతో పాటు మ్యూజిక్‌పై దృష్టిపెడతా అంటూ క్లారిటీ ఇచ్చింది. 

47

రీసెంట్ గా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యూటీ తనకు సంగీతంపై ఉన్న ఇంట్రెస్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. లండన్‌లోని ప్రఖ్యాత బ్యాంక్‌ భవనంలో సోలో లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేయడం ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడున్న వారంతా నా పాటకు ముగ్ధులైపోయారు అంటూ ఆనందంగా చెప్పింది బ్యూటీ. 

57

నటనతో పాటు సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని కనబరుస్తూ మల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుందీ భామ. అయితే  ఈ మధ్య మాత్రం వరుస సినిమా  కమిట్‌మెంట్స్‌ వల్ల సింగింగ్‌కు కాస్త బ్రేక్‌ నిచ్చానని చెప్పింది.
 

67

పాటల విషయంలో తన మెమరీస్ ను గుర్తు చేసుకుంది శ్రుతి... ఓ రెస్టారెంట్‌ దగ్గర చేసిన కచేరికి తాలూకు స్వీట్ మెమరీస్ ను పంచకుంది. అక్కడ  కూడా తన పాటకు మంచి పేరొచ్చిందని వెల్లడించింది. మళ్లీ అలాంటి సోలో షోస్‌ చేయాలనుంది. లాక్‌డౌన్‌ వల్ల అవన్నీ కుదరలేదు అంటోంది. 

77

నటనతో పాటు సంగీతంలో  కూడా  తన టాలెంట్ ఏంటో నిరూపించాలి అనుకుంటుందట శృతి. అంతే కాదు ఫ్యూచర్ లో  సోలో సింగర్ గా ఆడియన్స్ ను అలరిస్తానంటోంది. ఇక ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది శృతిహాసన్‌. బాలయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది.
 

click me!

Recommended Stories