Karthika Deepam: దీప పరిస్థితి తలుచుకొని కుమిలిపోతున్న సౌందర్య.. హిమకి అసలు నిజం చెప్పిన మోనిత?

First Published Jan 18, 2023, 8:57 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో దీప,కార్తీక్ సౌర్యకి భోజనం వడ్డిస్తూ ఎందుకు అత్తయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి నేను వడ్డిస్తాను అని చెప్పాను కదా దీప మళ్లీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగా పర్లేదు అత్తయ్య అనడంతో నేను చెప్పే వరకు నువ్వు వంట గదిలోకి వెళ్లొద్దు అని దీపను కూర్చోమని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోని హిమ అక్కడికి వచ్చి కార్తీక్ వాళ్ళ వైపు చూస్తూ ఎలా అయిన నిజం తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌర్య అందరూ కలిసి రేపు గుడికి వెళ్దాం అమ్మానాన్నలు వస్తే ముడుపు కడతాను ముక్కుకున్నాను అని అంటుంది.
 

మీరు వెళ్ళండి నేను మీ తాతయ్య,దగ్గరికి వెళ్తాను అంటుంది. తర్వాత సౌందర్య వంట చేస్తూ ఏడుస్తూ ఉండగా ఏమైంది అత్తయ్య అనడంతో ఏం లేదు ఇందాక పొగ వచ్చింది అందుకే, అయినా నిన్ను వంటగదిలోకి రావద్దు అని చెప్పాను కదా అని అంటుంది సౌందర్య. అప్పుడు దీప కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటయ్యా అయినా మీరు నాతో పాటు రండి అని సౌందర్యను బయటకు పిలుచుకొని వెళ్తుంది. సౌందర్యని సోఫాలో కూర్చోబెట్టి దీప కింద కూర్చొని మీకు నిజం తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్య అనగా ఏం నిజం అని సౌందర్య అంటుంది. నైట్ నుంచి మీ ప్రవర్తన బాగా గమనించాను అత్తయ్య. మీరు కూడా మీ అబ్బాయి లాగే నటించడం రాదు మీ ముఖంలో బాధ బాగా కనిపిస్తోంది.

ఇంకా నిజం చెప్పాలి అంటే ఈ రిపోర్ట్స్ చూసినా మీరు అబద్ధం చెప్తారా అనగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సౌందర్య. ఇప్పుడు దీపను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సౌందర్య. మీరు ఇలా ఎమోషనల్ అవుతారు అని నేను చెప్పలేదు అత్తయ్య. మీరే ధైర్యంగా ఉంటారు అనుకుంటే ఇలా ఏడుస్తున్నారు పిల్లలు చూస్తే బాధపడతారు అత్తయ్య అని అంటుంది. నాకు ఒక మాట ఇవ్వాలి అత్తయ్య అనగా ఏంటి ఈ దీప చెప్పు చేస్తాను అనడంతో నా పిల్లలకు తల్లి కావాలి అనగా సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ దీపా అనగా జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను నా పిల్లలకు తల్లి కావాలి ఈ ఇంటికి కోడలు కావాలి అని అంటుంది దీప. ఆ మోనిత నేను లేకపోతే ఇంకా రెచ్చిపోయి మిమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉంటుంది అత్తయ్య నా మాట వినండి అని అంటుంది.

డాక్టర్ బాబు కోసం ఇంకా రెచ్చిపోతుంది. పిల్లలు మీరు అందరూ చాలా ఇబ్బందులు పడతారు నా మాట వినండి అని అంటుంది. అప్పుడు వారిద్దరూ దీప పరిస్థితి తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే పిల్లలు రావడంతో దీప, సౌందర్య ఇద్దరు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరొకవైపు మోనిత సంతోష పడుతూ నైట్ నేను చెప్పిన దానికి హిమ టెన్షన్ పడుతూ కచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అప్పుడు హిమను రెచ్చగొట్టి కార్తీక్ ని నా వైపు మళ్లించేలా నేను చెప్పినట్టు చేసేలా చేయాలి అనుకుంటూ ఉంటుంది. హిమ చేయాల్సింది హిమా చేస్తే తర్వాత నేను చేయాల్సింది చేస్తాను అనుకుంటూ ఉంటుంది మోనిత. అప్పుడు కార్తీక్ నా మెడలో తాళి ఎలా కట్టడో నేను చూస్తాను. దీప ఈ మోనిత నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు చూపిస్తాను. నేను ఏంటో చూడు అనుకుంటూ ఉంటుంది.

మరోవైపు దీప కార్తీక్ సౌందర్య గురించి మాట్లాడుతూ ఎంత తెలియకూడదు అని జాగ్రత్త పడిన తెలిసిపోయింది డాక్టర్ బాబు అని అంటుంది దీప. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే సౌర్య అక్కడికి వస్తుంది. హిమ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి బుక్కు తెచ్చుకోవడానికి వెళ్ళింది అనగా నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అని అనడంతో తప్పంతా మీదే అమ్మ నేను మిమ్మల్ని వెతకడానికి సమయం సరిపోయింది అని అనుకుంది సౌర్య. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. మరొకవైపు హిమ మోనిత దగ్గరికి వెళుతుంది. అప్పుడు మోనిత కావాలని ఓవర్గా మాట్లాడుతూ హిమ కు టెన్షన్ మరింత పెంచుతూ ఉంటుంది. అప్పుడు మోనిత, దీప గురించి అసలు విషయం హిమకు చెప్పడంతో సుమ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
 

 ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మా అమ్మ నాన్న నాతో ఎందుకు చెప్పకుండా ఉంటారు మీరు అబద్ధం చెబుతున్నారు ఆంటీ అనడంతో కావాలంటే వెళ్లి మీ అమ్మానాన్నలను అడుగు అని రెచ్చగొడుతుంది. మీ అమ్మను బతికించాలంటే ఒక అవకాశం ఉంది నేను చనిపోయి మీ అమ్మకు గుండెను ఇస్తాను అనగా మోనిత మాటలు నిజం అని నమ్మిన హిమ మా అమ్మ కోసం మీరు ఎంతలా ఆరాటపడుతున్నారంటే మా అమ్మ అంటే మీకు ఎంత ప్రేమ అని అంటుంది. మా డాడీ నేను ఒప్పిస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను కానీ మా అమ్మని ఎలా అయినా బతికించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హిమ.

మరొకవైపు సౌర్య కార్తీక్ నీ ప్రశ్నిస్తూ ఎందుకు మీరు ఇన్ని రోజులు మా దగ్గరికి రాలేదు అనగా ఇప్పుడు వచ్చాము కదా అని అంటాడు కార్తీక్. అప్పుడు సరే నాన్న మనమందరం ఇలాగే ఎప్పటికి కలిసి సంతోషంగా ఉండాలని దేవుడికి ముడుపు కట్టోస్తాను అని అక్కడికి వెళుతుంది. మరొకవైపు దీప పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దీప తన పరిస్థితి చెప్పడంతో పూజారి కూడా బాధపడుతూ ఉంటుంది. నన్ను ఇంకొద్ది రోజుల్లో బతికించమని దేవుడికి వేడుకోండి అనగా పూజారి  తప్పకుండా పూజ చేస్తాను అని అంటాడు.

click me!