Karthika Deepam: కార్తీకదీపంలో మరో ట్విస్ట్.. కలుసుకున్న అక్కచెల్లెలు.. హిమను ఏడిపించిన స్వప్న!

Navya G   | Asianet News
Published : Mar 23, 2022, 09:02 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవ్వగా ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం. హిమ (Hima) తన పుట్టిన రోజు సందర్భంగా హాస్పిటల్లో అందరికీ స్వీట్లు పంచుతుంది.  

PREV
16
Karthika Deepam: కార్తీకదీపంలో మరో ట్విస్ట్.. కలుసుకున్న అక్కచెల్లెలు.. హిమను ఏడిపించిన స్వప్న!

ఆ తర్వాత హాస్పటల్లో ఒక ఆవిడ ద్వారా హిమ.. సౌర్య (Sourya) ఎక్కడ ఉంటుందో ఆ వివరాలు తెలుసుకుని ఆనందంగా కారులో వెళుతుంది. మరోవైపు సౌర్య వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన ఘటనను ఊహించుకొని హిమ (Hima) ను వదిలేదే లే అని మనసులో అనుకుంటుంది.
 

26

అదే క్రమంలో సౌర్య నన్నందరి ప్రేమకు దూరం చేసి హిమ (Hima) మాత్రం అందరితో కలిసి ఉంటుంది. అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలు అయినా హిమ మీద కోపం తగ్గదు పైగా అది పెరుగుతూనే ఉంటుంది. అని సౌర్య (Sourya) మనసులో మరింత కోపం వ్యక్తం చేసుకుంటుంది.
 

36

మరోవైపు హిమ (Hima) థాంక్స్ దేవుడా పుట్టినరోజు నాడే సౌర్య ను కలిపిస్తున్నావా అంటూ ఆనందంగా కారులో సౌర్య దగ్గరకి వెళుతుంది. కానీ ఈలోపు కారు ట్రబుల్ ఇస్తుంది. ఇక అటుగా వస్తున్న జ్వాలా (Jwala) సౌర్య కారును రిపేర్ చేసి పెడుతుంది.
 

46

ఇక ఆ తర్వాత హిమ (Hima) అక్కడి నుంచి హాస్పిటల్ లో ఒక ఆవిడ చెప్పిన అడ్రస్ కి వెళ్లగా అక్కడ సౌర్య పేరుతో వీరు అనే ఒక అమ్మాయి ఉంటుంది. దాంతో హిమ ఎంతో విచారం వ్యక్తం చేస్తుంది. మరోవైపు జ్వాలా (Jwala) తన తల్లిదండ్రులుగా  భావించుకున్న ఇంద్రుడు చంద్రమ్మ లతో షాపింగ్ చేస్తుంది.
 

56

 ఇక షాపింగ్ చేసి బయటికి వస్తున్న క్రమంలో జ్వాలా (Jwala) ప్రేమ్ తో తన ఆటో అడ్డుగా ఉన్నందుకుగాను మరో స్థాయిలో గొడవ పెట్టుకుంటుంది. మరోవైపు సౌర్య, నిరూపమ్ (Nirupam) ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ స్వప్న దగ్గరికి వెళ్తారు. ఇక అది చూసిన స్వప్న.. హిమ ను ఏమ్మా ఇంకా నీ డ్రైవింగ్ సరదా అలాగే కంటిన్యూ చేస్తున్నావా అంటూ దెప్పిపోసుడ్తుంది.
 

66

దానికి హిమ ఎంతో బాధను వ్యక్తం చేస్తుంది. దాంతో నిరూపమ్ (Nirupam) ఏంటమ్మా అలా అడుగుతున్నావ్ అని అనగా సొంత తమ్మున్ని పోగొట్టుకున్నాను రా అని నిరూపమ్ తో అంటూ హిమ బాధపడేలా చేస్తుంది. మరోవైపు సౌర్య (Sourya) తను గొడవ పెట్టుకున్న ప్రేమ్ ఇంటికే ఇంద్రుడు చంద్రమ్మ లతో కలిసి వెళుతుంది. దాంతో  ప్రేమ్ హిమ పై మరింత చిరాకు పడతాడు.

click me!

Recommended Stories