Nayanatara: తల్లైన నయనతార... వెలుగులోకి షాకింగ్ విషయాలు?

Published : Mar 22, 2022, 10:43 PM IST

నయనతార- విగ్నేష్ శివన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఆరేడేళ్లుగా నాన్ స్టాప్ గా ప్రేమించుకుంటున్నారు ఈ జంట. కోలీవుడ్ ఎవర్ గ్రీన్ ప్రేమికులుగా పాపులరైన వీరి ప్రేమ బంధంపై రోజుకో వార్త, వారానికో పుకార్లు పుట్టుకొస్తుంది.   

PREV
15
Nayanatara: తల్లైన నయనతార... వెలుగులోకి షాకింగ్ విషయాలు?
Nayanatara

తాజాగా నయనతార (Nayanatara)తల్లి అయ్యిదంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. ఆ వార్తలకు బలం చేకూర్చేలా కొన్ని లాజిక్స్ ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని ప్రముఖ అమ్మవారి ఆలయంలో విగ్నేష్, నయనతార కనిపించారు. ఆ సమయంలో నయనతార పాపిట కుంకుమ ధరించడం హాట్ టాపిక్ అయ్యింది. కేవలం పెళ్ళైన స్త్రీలు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు. 
 

25
Nayanatara

కాబట్టి విగ్నేష్(Vignesh Shivan)-నయనతార రహస్య వివాహం చేసుకొని ఉండవచ్చు. అందుకే నయనతార అలా కుంకుమ పెట్టుకున్నారన్న ప్రచారం మొదలైంది. పేరుకు ప్రేమికులైనా భార్యాభర్తలకు మించిన అనుబంధం వీరి మధ్య కొనసాగుతుంది. కాబట్టి రహస్య వివాహ పుకార్లను కొట్టిపారేయలేం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 
 

35
Nayanatara


తాజాగా మరో ఆసక్తికర వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. నయన్‌, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్‌. దీనికి విఘ్నేశ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. 

45
Nayanatara

ఈ నేపథ్యంలో నయన్‌, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్‌సైట్‌లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్‌ ఫుల్‌ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.   విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు.
 

55
Nayanatara


ఈ క్రమంలో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు ప్రకటించి.. పెళ్లి మాత్రం అందరి సమక్షంలో అంగరంగ వైభవం చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక గతంలో శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమాయణం జరిగిపారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ రెండు ప్రేమ కథలు బ్రేకప్ గా ముగిశాయి. 

click me!

Recommended Stories