Item Songs: 'మున్నీ బద్నామ్' నుంచి లేటెస్ట్ 'ఆజ్ కీ రాత్' వరకు ఐటెం సాంగ్స్ క్రియేట్ చేసిన క్రేజ్ మామూలిది కాదు. ఈ పాటల్లో నడుము ఊపే హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు!
ఈ రోజుల్లో సినిమాలో కథ ఎలా ఉన్నా, ఒక కిక్కిచ్చే 'ఐటెం సాంగ్' మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే! కొన్నిసార్లు సినిమా మొత్తం హిట్టయ్యేది ఈ ఒక్క పాట వల్లే అంటే అతిశయోక్తి కాదు. తెలుగులోనూ ఐటెమ్ సాంగ్‌లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ విషయంలో బాలీవుడ్ ముందు స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. అక్కడ ఈ స్పెషల్ సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఒకప్పటి 'మున్నీ బద్నామ్' నుంచి లేటెస్ట్ 'ఆజ్ కీ రాత్' వరకు, ఐటెం సాంగ్స్ క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పాటల్లో కేవలం 3-4 నిమిషాల డ్యాన్స్ కోసం హీరోయిన్లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతకీ, ఈ ఐటెం సాంగ్స్ ప్రపంచంలో అసలు రాణి ఎవరు? ఎవరికి ఎంత డిమాండ్ ఉందనేది చూస్తే.
27
కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు
బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కు కొత్త ఊపు తెచ్చింది మలైకా అరోరా. 'దబాంగ్' సినిమాలో 'మున్నీ బద్నామ్ హుయీ' పాటకు ఆమె స్టెప్పులేస్తే దేశమంతా ఊగిపోయింది. ఆ రోజుల్లోనే ఆ ఒక్క పాట కోసం మలైకా ఏకంగా రూ. 2.5 కోట్లు తీసుకుంది. ఇక 'అగ్నిపథ్' సినిమాలో కత్రినా కైఫ్ చేసిన 'చిక్నీ చమేలీ' సాంగ్ కోసం రూ. 2 కోట్లు ఛార్జ్ చేసింది.
37
తమన్నాకి భారీ పారితోషికం
ఇటీవల 'స్త్రీ 2' సినిమాలో 'ఆజ్ కీ రాత్' పాటతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ ఒక్క పాట కోసం దాదాపు రూ. 1 కోటి తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ప్రపంచంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి మన సౌత్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో 'ఊ అంటావా మావా' పాటకు సమంత చూపిన గ్లామర్, డ్యాన్స్ ఇండియా మొత్తాన్ని ఊపేశాయి. కేవలం మూడున్నర నిమిషాల ఈ పాట కోసం సమంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంది! ఇది చాలా మంది హీరోయిన్ల పూర్తి సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ.
57
రెండు కోట్లు తీసుకున్న నోరా ఫతేహి
'దిల్బర్ దిల్బర్' పాటలో తన బెల్లీ డ్యాన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన నోరా ఫతేహి, ఒక పాటకు రూ. 2 కోట్లు తీసుకుంటుంది. ఆమె డ్యాన్స్ చూడటానికే థియేటర్లకు వచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు.
67
సన్నీలియోన్‌కి స్పెషల్ క్రేజ్
ఐటెం సాంగ్ అనగానే ఇప్పుడు గుర్తొచ్చే పేర్లలో సన్నీ లియోన్, నోరా ఫతేహి ముందుంటారు. 'బేబీ డాల్' పాటతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సన్నీ లియోన్, తన పాపులారిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక్కో పాటకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేసేది.
77
మల్లికా షేరావత్ రచ్చ వేరే లెవల్
మల్లికా షెరావత్ 'జిలేబీ బాయ్' పాట ఇప్పటికీ పార్టీల్లో ఫేవరెట్. ఆమె కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో ఒకరు. మొత్తానికి, సినిమా హీరోల కంటే ఈ ఐటెం సాంగ్ సుందరీమణులకే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. కేవలం పాటతోనే సినిమాను సూపర్ హిట్ చేసే సత్తా వీరికి ఉండటంతో, నిర్మాతలు కూడా కోట్లు కుమ్మరించడానికి వెనకాడటం లేదు.