Top 5 Kollywood Films 2026: ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే.. సూర్యకి రజనీ షాక్‌

Published : Oct 26, 2026, 03:34 PM IST

Tamilnadu Box Office 2026: 2026లో తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్, సూర్య, విజయ్ సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 తమిళ సినిమాల లిస్ట్ ఇక్కడ చూద్దాం.

PREV
16
2026లో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపిన కోలీవుడ్‌ చిత్రాలు

తమిళ సినిమాకు 2026వ సంవత్సరం బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఈ ఏడాది వచ్చిన చాలా చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి. అలాగే రజనీకాంత్, సూర్య లాంటి స్టార్ హీరోల పెద్ద సినిమాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. సూర్యకి సూపర్‌ స్టార్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు.

26
5. థాయ్‌ కిళవి

శివకుమార్ మురుగేశన్ డైరెక్షన్‌లో రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'థాయ్ కిళవి'. శివకార్తికేయన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర రూ.66.85 కోట్లు వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. నిర్మాత శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' సినిమా తమిళనాడు కలెక్షన్ల కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

36
4. మండాడి

తమిళ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మరో సినిమా 'మండాడి'. పడవ పందేల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సూరి హీరోగా నటించారు. సుహాస్, మహిమా నంబియార్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం సూరి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. తమిళనాడులో మాత్రమే ఈ సినిమా రూ.101 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాస్ రికార్డ్ సెట్ చేసింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఓవరాల్‌గా ఇది రూ.150కోట్లు రాబట్టినట్టు సమాచారం.

46
3. జన నాయగన్‌

తమిళ బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్ సినిమా `జన నాయగన్‌` కూడా ఈ లిస్ట్‌లో ఉంది. విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా. జులైలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యంగా తమిళనాడులో మాత్రమే రూ.155 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయినా కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టడం మామూలు విషయం కాదు.

56
4. కరుప్పు-విశ్వనాథ్‌ అండ్‌ సన్స్

సూర్యకు ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మే నెలలో రిలీజైన 'కరుప్పు' సినిమా సూర్యకు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా తమిళనాడులో మాత్రమే రూ.164 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే కాదు ఈ ఏడాది సూర్య `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్`లోనూ నటించాడు. తెలుగులో విడుదలైన ఈ చిత్రం తమిళంలోనూ రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది. హిట్‌ సినిమాల జాబితాలో చేరింది.

66
1. జైలర్‌ 2

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమా ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 15న థియేటర్లలోకి వచ్చింది. రెండు వారాలు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. తమిళనాడులో మాత్రమే రూ.166 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ ఏడాది తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'జైలర్ 2' రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు సూర్య రెండు సినిమాల కలెక్షన్లని రజనీ ఒక్క మూవీతోనే దాటేయడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories