Mahesh Babu: మహేష్ బాబు ఫ్యూచర్ ని ముందే ఊహించిన కవి.. ఫ్లాప్ మూవీ పాట 100 శాతం నిజమైందిగా

Published : Oct 26, 2026, 02:47 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ ఫ్లాప్ మూవీలో ఆయన ఫ్యూచర్ ని కవి ముందే ఊహించారు. ఒక్క పాటలో మహేష్ బాబు భవిష్యత్తుని చెప్పేశారు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు భవిష్యత్తుని ఓ కవి ముందే ఊహించారు. ఆ ఆయన మహేష్ బాబు గురించి చెప్పిన ఈ విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఆ విషయాలు చెప్పింది ఎవరో కాదు గేయ రచయిత, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్. చంద్రబోస్ మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలకు పాటలు రాశారు.

25
రాంచరణ్ గురించి ఇలా..

ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సంపత్ నందితో చంద్రబోస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు కంటే ముందుగా రాంచరణ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. రచ్చమూవీలో టైటిల్ సాంగ్ రాయమన్నాను. చంద్రబోస్ గారు రాశారు. కానీ కోరస్ కి కూడా కొన్ని లైన్స్ ఉంటె బావుంటుంది అని చెబితే అక్కడికక్కడే గ్లోబల్ స్టార్, గూగుల్ స్టార్ అని రాశారు. ఇప్పుడు రాంచరణ్ విషయంలో అదే నిజం అయిందిగా అని సంపత్ నంది అన్నారు. ఆర్ఆర్ఆర్ తో చరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు.

35
ముందే ఊహించగలం

చంద్రబోస్ మాట్లాడుతూ.. కవులు చాలా సందర్భాల్లో దూరదృష్టితో ఆలోచిస్తారు. ఆ శక్తి కవులకు ఉంటుంది. లేకుంటే రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ అని అంటరాని నాకు ఎలా తెలుసు ? అందుకే ఇంద్రియాతీయ విషయాలని కూడా కవులు ఊహిస్తారు అని అంటారు.

45
టక్కరి దొంగ మూవీలో మహేష్ బాబు ఫ్యూచర్

అదే విధంగా టక్కరి దొంగ మూవీలో నలుగురికి నచ్చనిది నాకసలే ఇక నచ్చదు రో అనే పాట మహేష్ బాబు కోసం రాశాను. అందులో నిండు చందురుడు ఒకవైపు చిక్కులు ఒకవైపు.. నేను ఒక్కడిని ఒకవైపు ఈ లోకం ఒకవైపు అని రాశాను. ఆ తర్వాత 1 నేనొక్కడినే అనే సినిమా మహేష్ బాబు చేశారు. బుద్ధిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్.. పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్.. అని రాశాను. పోకిరి సినిమా కూడా వచ్చింది అని చంద్రబోస్ అన్నారు.

55
సంపత్ నంది భోగి మూవీ

మహేష్ బాబు భవిష్యత్తు సినిమాల గురించి రచయిత చంద్రబోస్ ముందే ఊహించడం ఆశ్చర్యమే అని చెప్పొచ్చు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబోస్ ఈ విషయాలు సంపత్ నంది తెరకెక్కిస్తున్న భోగి మూవీ ప్రమోషన్స్ లో తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories