Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?

Published : Aug 29, 2026, 07:58 PM IST

Hi Movie Box Office: విష్ణు ఎడవన్ దర్శకత్వంలో కవిన్, నయనతార జంటగా నటించిన 'హాయ్' సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందో ఈ గ్యాలరీలో వివరంగా చూద్దాం.

PREV
13
హాయ్‌ మూవీతో అలరించిన నయనతార

నయనతార హీరోయిన్‌గా నటించిన 'హాయ్' సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కవిన్ హీరోగా నటించాడు. రాధికా శరత్‌కుమార్, ప్రభు, భాగ్యరాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. సెవెన్ స్క్రీన్, జీ సంస్థలతో కలిసి నయనతార ఈ సినిమాను నిర్మించారు.

23
హాయ్ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

'హాయ్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1.38 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. రొమాంటిక్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంతటి తక్కువ కలెక్షన్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. నయనతార లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తోంది. ఆమెకి హీరోలకు స్థాయిలో ఇమేజ్‌ ఉంది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఆ ఇమేజ్‌ కనిపించలేదు. ఆమె నటించిన `హాయ్‌` మూవీకి ఇంతటి తక్కువ కలెక్షన్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి శనివారం నుంచి పుంజుకుంటుందా అనేది చూడాలి.

33
టాక్సిక్‌తో హాయ్‌ పోటీ

నయనతార నటించిన మరో మూవీ `టాక్సిక్‌` కూడా ఈ వారమే విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. రెండో రోజు భారీగా తగ్గాయి. మూడో రోజు మరింతగా పడిపోయింది. థియేటర్లో తన `హాయ్‌` మూవీకి నయనతార మరో మూవీ `టాక్సిక్‌` పోటీగా ఉండటం విశేషం. దీంతో తనకు తానే పోటీ అయ్యింది. అయినా రెండు సినిమాలు డల్‌గానే ఉండటం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories