OTT Movie: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ కామెడీ.. తండ్రి‌ నిర్వహించే కొంపని చూసి కొడుకు షాక్‌

Published : Mar 27, 2026, 03:43 PM IST

OTT Movie: సుహాస్‌, వీకే నరేష్‌ నటించిన `హే బల్వంత్‌` గత నెలలో థియేటర్లలో సందడి చేసింది. నవ్వులు పూయించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. తాజాగా ఓటీటీ డేట్‌ని ప్రకటించింది టీమ్‌. 

PREV
15
థియేటర్లో నవ్వులు పూయించిన హే బల్వంత్‌

ఇప్పుడు థియేటర్లో కంటే ఓటీటీలోనే అసలైన స్టఫ్‌ ఉంటుంది. కావాల్సిన సినిమాలు చూసుకోవచ్చు. కావాల్సిన జోనర్ చిత్రాలు చూడొచ్చు. నెమ్మదిగా చూసుకోవచ్చు, అవసరమైతే ఫార్వర్డ్ చేసి చూసుకోవచ్చు. అందుకే ఓటీటీలు సక్సెస్‌ అయ్యాయి. ఈ క్రమంలో ప్రతి వారం అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. వచ్చే వారం మంచి కామెడీ చిత్రం రాబోతుంది. సుహాస్‌, నరేష్‌, శివానీ నగరం, వెన్నెల కిశోర్‌, బాబుమోహన్‌ వంటి వారు కలిసి నటించిన `హే బల్వంత్‌` మూవీ ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది.

25
ఓటీటీలోకి హే బల్వంత్‌ మూవీ

గత నెలలో విడుదలైన `హే బల్వంత్‌` మూవీ థియేటర్లో మంచి ఆదరణ పొందింది. డ్రై టైమ్‌లో రావడంతో డీసెంట్‌గా ఆడింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 31న జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. తెలుగుతోపాటు, కన్నడ, తమిళం, మలయాళంలో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. గోపి ఆచార్య దర్శకత్వంలో నటించిన ఈ చిత్రాన్ని త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.

35
తండ్రి నిర్వహించే ఆ కొంప చూసి కొడుకు షాక్‌

గుంటూరు నేప‌థ్యంలో ‘హే బ‌ల్వంత్‌’ సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌(సుహాస్‌)కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌టంతో త‌ను షాక‌వుతాడు. అదే స‌మ‌యంలో మిత్ర‌(శివానీ నాగ‌రం)తో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేస్సే బిజినెస్ విషయం తెలిస్తే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న‌ల‌ మధ్య కృష్ణ‌ ఇరుక్కుపోతాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మ‌ధ్య అనుబంధం, అస‌లేం జ‌రిగింద‌నే నిజానిజాలు, చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు అనేదే అస‌లు క‌థాంశంగా సినిమా రూపొందింది. ఆద్యంతం నవ్విస్తూ, హార్ట్ ని టచ్‌ చేస్తుంది.

45
సుహాస్‌ రియాక్షన్‌

ఈ సంద‌ర్భంగా సుహాస్ మాట్లాడుతూ, `సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది. సినిమాలో మంచి కామెడీ ఉంది. అలాగే హృద‌యాన్నిహ‌త్తుకునే భావోద్వేగం ఉంది. నిజాయ‌తీతో చేసిన ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జీ5 ద్వారా ప్రేక్షకుల దగ్గరకు చేరుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మ‌రింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది` అని అన్నారు.

55
వీకే నరేష్‌ రియాక్షన్‌

సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్ మాట్లాడుతూ, హే బల్వంత్ సినిమాలో తండ్రీ కొడుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఇందులో బల్వంత్ పాత్ర చేయ‌టం సాధార‌ణ విష‌యం కాదు. న‌టుడిగా నాలో భిన్న‌మైన కోణాన్ని ఆవిష్క‌రించిన సినిమా ఇది. వైవిధ్య‌మైన‌, అర్థవంతమైన తెలుగు కథలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే జీ5లో ఈ సినిమా విడుదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది` అని చెప్పారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories