స్టార్ హీరోని డాడీ అని పిలుస్తూ చివరికి అతడితోనే హీరోయిన్ గా రొమాన్స్ చేసిన నటి.. ఎవరో తెలుసా ?

Published : Oct 23, 2025, 09:23 PM IST

ఓ క్రేజీ హీరోయిన్ తాను అంకుల్, డాడీ అని పిలిచే హీరోలతోనే హీరోయిన్ గా నటించి రొమాన్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఆ హీరోలు ఎవరు ? అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
శుభాకాంక్షలు మూవీతో హీరోయిన్ గా రాశి 

 నటీనటులు ఎవరైనా కథ ప్రకారం తమకి కేటాయించిన పాత్రల్లో ఒదిగిపోయి నటించాలి. ఎలాంటి పాత్రలో నటిస్తున్నాం ? ఎవరితో నటిస్తున్నాం ? అనేది పక్కన పెట్టి తమ పాత్రకి తగ్గట్లుగా నటించాలి. అప్పుడే గుర్తింపు దక్కుతుంది. హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్ లో కొన్ని ఛాలెంజ్ లు తప్పవు. శుభాకాంక్షలు చిత్రంతో నటి రాశి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. 

25
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రాశి 

అనేక చిత్రాల్లో హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది. శుభాకాంక్షలు మూవీ కంటే ముందు నుంచే బాల్యం లోనే రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఆదిత్య 369, మమతల కోవెల లాంటి చిత్రాల్లో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

35
స్టార్ హీరోకి కూతురిగా రాశి 

రాశి తన కెరీర్ లో ఎదురైనా ఛాలెంజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను చిన్నతనంలో బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. అప్పట్లో వారిని అంకుల్ అని పిలిచేదాన్ని. అలాంటి బాలయ్యకి కృష్ణబాబు సినిమాలో హీరోయిన్ గా నటించా. అదే విధంగా మమతల కోవెల సినిమాలో రాజశేఖర్ గారికి కూతురిగా నటించారు. 

45
డాడీ అని పిలిచిన హీరోతోనే రొమాన్స్ 

 ఆ సినిమాలో రాజశేఖర్ గారిని డాడీ అని పిలవడం బాగా అలవాటైపోయింది. కానీ ఆయనకి నేటి గాంధీ చిత్రంలో హీరోయిన్ గా గర్ల్ ఫ్రెండ్ గా నటించా. అది పెద్ద ఛాలెంజ్. పాత్ర సరిగ్గా పండాలి అంటే డాడీ అనే ఫీలింగ్ మైండ్ లో నుంచి తీసేయాలి. సినిమా అంటే సినిమానే.. అలాగే భావించి రాజశేఖర్ గారితో నటించినట్లు రాశి తెలిపారు. 

55
రాశి సినిమాలు 

శుభాకాంక్షలు మూవీలో హీరోయిన్ గా నటించిన రాశి ఆ తర్వాత వెనుదిగిరి చూసుకోలేదు. గోకులంలో సీత, పెళ్లి పందిరి, ప్రేయసి రావే, దేవుళ్ళు లాంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. రాశి తన కెరీర్ లో శ్రీకాంత్ తో ఎక్కువ సినిమాలు చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories