జాన్వీ కపూర్ తన ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని బహిరంగంగా అంగీకరించింది. అయితే ప్లాస్టిక్ సర్జరీ విషయంలో తాను ఎంత తెలివిగా వ్యవహరించాను అనే విషయాన్ని కూడా జాన్వీ బయట పెట్టింది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె కావడంతో నెటిజన్లలో ఆమె గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. అయితే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే వాదనలు చాలా కాలంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ స్వయంగా ప్లాస్టిక్ సర్జరీ గురించి స్పందించింది.
25
నిజమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా
జాన్వీ కపూర్.. కాజోల్, ట్వింకిల్ హోస్ట్ చేసిన టాక్ షో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” లో పాల్గొని తన ప్లాస్టిక్ సర్జరీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తాను నిజంగా సర్జరీ చేయించుకున్నానని, కానీ అది తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే జరిగిందని ఆమె తెలిపింది.
35
అమ్మ సలహాతో తెలివైన నిర్ణయాలు
జాన్వీ మాట్లాడుతూ, “నేను చేసిన ప్రతిదానిలో చాలా తెలివిగా, జాగ్రత్తగా, సరైన నిర్ణయాలు తీసుకున్నాను. ఆ సమయంలో అమ్మ శ్రీదేవి నాకు అండగా నిలిచింది. ఆమె సూచనలు, అనుభవం వల్లే నేను తప్పులు చేయకుండా ముందుకు సాగాను. నేను యువతుల కోసం ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. ఇది వారికి హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయి వీడియో చూసి తాను కూడా ఈ బఫెలో-ప్లాస్టీ చేయించుకోవాలి అని అనుకుని ఏదైనా తప్పు జరిగితే, అది చాలా ప్రమాదకరం అవుతుంది. అందుకే పారదర్శకత చాలా ముఖ్యం” అని వివరించింది.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ‘బఫెలో-ప్లాస్టీ’ అనే పదంపై కూడా స్పందించింది. ఆమె చేసిన సర్జరీలు ఏవో, ఎంతవరకు జరిగాయో వెల్లడించకపోయినా, తాను ఇప్పుడు పూర్తిగా ఓపెన్ బుక్‌గా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. “ఇకపై దాచిపెట్టే ఏదీ ఉండదు. నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని బహిరంగంగా చెబుతాను” అని జాన్వీ స్పష్టంగా తెలిపింది.సోషల్ మీడియాలో తన రూపం, శరీరం, దుస్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లపై విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ, తనలాంటి యువతులు తప్పుడు అంచనాలతో ముందుకు వెళ్లకుండా ఉండాలని కోరింది. “సోషల్ మీడియా మనసులను ప్రభావితం చేస్తుంది. అందుకే నిజం చెప్పడం చాలా అవసరం. మన శరీరాన్ని మనం అంగీకరించడం సిగ్గు కాదు అని ఆమె చెప్పింది.
55
పెద్ది మూవీతో బిజీగా జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ తన తల్లి, లెజెండరీ నటి శ్రీదేవి గురించి కూడా ప్రస్తావించింది. “అమ్మ ఎప్పుడూ నాకు బలాన్నిచ్చేది. ఆమె నన్ను ప్రేమతో, జాగ్రత్తగా చూసుకునేది. నేను తీసుకునే నిర్ణయాల్లో ఆమె ముద్ర ఎప్పుడూ ఉంటుంది” అని భావోద్వేగంగా చెప్పింది.ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న “పెద్ది” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆల్రెడీ జాన్వీ కపూర్ తెలుగులో దేవర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.