Payal Rajput
పాయల్ రాజ్ పుత్ కి టాలీవుడ్ లో బోల్డ్ ఇమేజ్ ఉంది. ఆర్ఎక్స్ 100 మూవీ ఈ భామ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రంలో మితిమీరిన శృంగార సన్నివేశాల్లో ఆమె నటించారు. హీరో కార్తికేయ-పాయల్ మధ్య లెక్కకు మించిన శృంగార సన్నివేశాలు తెరకెక్కాయి.
Payal Rajput
ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్ పుత్ అంటే శృంగార చిత్రాల హీరోయిన్ అనే పేరు పడింది. వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో పాయల్ హోమ్లీ రోల్స్ చేసింది. ఆ చిత్రాలేవీ ఆమెకు ఫేమ్ తేలేదు. ఆర్ డి ఎక్స్ లవ్ టైటిల్ తో ఓ మూవీ చేసింది. అందులో మరలా శృంగార సన్నివేశాల్లో నటించింది.
పాయల్ లేటెస్ట్ మూవీ మంగళవారం. ఈ చిత్రంలో మరోసారి ఆమె బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించింది. ఆమె క్యారెక్టరైజేషన్ అత్యంత బోల్డ్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు అజయ్ భూపతి. శృంగారం అంటే అమితంగా ఇష్టపడే అమ్మాయి పాత్ర చేసింది పాయల్ రాజ్ పుత్. ఓ సన్నివేశంలో ఆమె కొరడాతో కొట్టించుకుంటూ అనుభూతి పొందుతుంది.
Payal Rajput
ఈ సన్నివేశంలో ఆమె లోదుస్తుల్లో ఉంటుంది. ఈ సీన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ నెటిజెన్.. 'పాయల్ బ్రా' అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ పై పాయల్ రాజ్ పుత్ స్పందించారు. అసభ్యకర కామెంట్ చేసిన నెటిజెన్ కి బుద్ధి చెప్పింది.
'ఆ బ్రా నాది కాదు. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చారు' అని కామెంట్ చేసింది. సన్నివేశంలో భాగంగా నేను లోదుస్తుల్లో కనిపించాను. అది సినిమాలో భాగంగా తీసుకోవాలని అర్థం వచ్చేలా పాయల్ రాజ్ పుత్ సమాధానం ఇచ్చింది. పాయల్ రాజ్ పుత్ కామెంట్ వైరల్ అవుతుంది.
కాగా మంగళవారం మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వరల్డ్ కప్ ఫైనల్ మంగళవారం చిత్రాన్ని దెబ్బతీసింది. ఆదివారం ఫైనల్ కాగా... జనాలు థియేటర్స్ వైపుకు రాలేదు. దాంతో కీలకమైన వీకెండ్ కోల్పోయింది.