బ్యూటీపుల్ లుక్స్ తో యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ వెండితెరపై అలరిస్తూనే వస్తోంది. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రంలో కోడలి పాత్రలో మెప్పించింది. చాలా పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది.
‘జైలర్’ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింతగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గానూ కనిపిస్తూ వస్తోంది. మరోవైపు తనలోని గ్లామర్ కోణాన్ని కూడా నెటిజన్లకు పరిచయం చేస్తోంది.
ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్ట్రేట్ ఫిల్మ్ తగిలితే లెక్క వేరేలా ఉంటుందంటున్నారు.
తాజాగా మిర్నా మీనన్ పంచుకున్న ఫొటోలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ క్రాప్డ్ టాప్, టైట్ జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది. బిగుతైన దుస్తుల్లో హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది.
చేతులు పైకెత్తి మత్తెక్కించేలా ఫోజులిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు హాట్ బాడీ షేప్ లను చూపిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. నిషా కళ్లతో మత్తు చూపులు చూస్తూ కుర్రకారును ఉర్రూతలూగించింది.
ఇక ఇప్పటికే మిర్నా మీనన్ తెలుగులోనూ సందడి చేసింది. ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇప్పుడు నాగార్జున ‘నా సామీరంగ’ చిత్రంలో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.