1967 జూలై 14న పుట్టిన అశ్విని.. సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇంటర్ చదువుతున్న టైమ్ లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం ఇలా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది.