ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?

First Published | Jul 13, 2024, 5:52 PM IST

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. కాని చదువు మాత్రం అంతంత మాత్రమే.. ఇంటర్ కూడా పూర్తి చేయలేదు... చదువు మానేసి సినిమాల్లో బిజీ అయిన ఈ బ్యూటీ.. కోట్లు సంపాదిస్తోంది. 

స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరిసింది. ఓ బడా సినిమా కుటుంబం నుంచి వచ్చింది.. ఓ భారీ సినిమా కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. చిన్న వయస్సులోనే పెళ్ళి చేసుకుని.. ఒ బిడ్డకు తల్లికూడా అయ్యింది. అయినా తగ్గేది లేదంటూ.. మోడలింగ్ తో పాటు.. హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె సంపాదన ఎన్ని కోట్లు.. ?

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?

స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరిసింది. ఓ బడా సినిమా కుటుంబం నుంచి వచ్చింది.. ఓ భారీ సినిమా కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. చిన్న వయస్సులోనే పెళ్ళి చేసుకుని.. ఒ బిడ్డకు తల్లికూడా అయ్యింది. అయినా తగ్గేది లేదంటూ.. మోడలింగ్ తో పాటు.. హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె సంపాదన ఎన్ని కోట్లు.. ?


ఇప్పటి వరకూ మనం చెప్పుకుంటున్న హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. అవును స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ సినిమాలో కూడా అడుగు పెట్టింది ఆలియా భట్. 

బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ బీర్ కపూర్ తో దాదాపు ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోతో సహజీవనం కూడా చేసిందని టాక్. అందరు హీరోయిన్లతో పోల్చితే.. చాలా చిన్న వయస్సులోనే రణ్ బీర్ ను పెళ్లి చేసుకున్న ఆలియా భట్... వెంటనే ఏడాది తిరక్కముందు ఓపాపకు జన్మనిచ్చిందికూడా. 
 

పెళ్ళై.. ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత కూడా ఏమాత్రం తగ్గడంలేదు ఆలియా భట్. అదిరిపోయేలా ఫ్యాషన్ ను ఫాలో అవుతూ.. మోడల్ గా..హీరోయిన్ గా రాణిస్తోంది. ఇంటర్నేషనల్ వేదికల పైన ఫ్యాషన్ నడకలు నడుస్తూ.. ఫ్యాన్స్ ను అలరిస్తోంది ఆలియా. హీరోయిన్ గా సినిమాలు కూడా చేస్తోంది. అటు ఫ్యామిలీ బాధ్యతలు.. ఇటు సినిమాలు, మరోవైపు తన వ్యాపారం కూడా చూసుకుంటోంది బ్యూటీ. 
 

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇన్ని బాధ్యతలను పర్ఫెక్ట్ గా చేస్తూ వస్తోన్న ఆలియా భట్ కనీసం ఇంటర్ కూడా  పూర్తి చేయలేదు. చదువు మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తి పెంచుకున్న అలియా భట్‌కి వరుసగా అవకాశాలు రావడంతో పాటు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటిస్తోంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ. 

Alia Bhatt

అలియా భట్ నటుడు రణబీర్ కపూర్‌ను  ప్రేమించి  వివాహం చేసుకుంది . వీరికి రాహా కపూర్‌ అనే కూతురు కూడా ఉంది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.   అలియా భట్ ఒకరు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా ఆలియా భట్ వరుసుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె నటించిన సినిమాల్లాగే ఆమె నిర్మించే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!