జబర్దస్త్ ఏం సరిపోతుంది, అది చాలా వల్గర్... అనసూయ విమర్శించిన వాళ్లెవరో తెలిస్తే షాక్ అవుతారు!

Published : Jul 13, 2024, 05:13 PM ISTUpdated : Jul 13, 2024, 05:44 PM IST

జబర్దస్త్ షో పై, ఆ షోలో అనసూయ ధరించి బట్టలపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా డబుల్ మీనింగ్ జోక్స్ పై సాంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేశారు. అయితే 80-90లలో వచ్చిన సినిమాల్లో అంతకంటే పచ్చి సాహిత్యం ఉందని ఆమె కామెంట్స్ చేశారు.   

PREV
17
 జబర్దస్త్ ఏం సరిపోతుంది, అది చాలా వల్గర్... అనసూయ విమర్శించిన వాళ్లెవరో తెలిస్తే షాక్ అవుతారు!
Jabardasth Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ న్యూస్ రీడర్ గా మొదటిసారి బుల్లితెరపై కనిపించింది.  అనంతరం ఆమెకు జబర్దస్త్ షో యాంకర్ గా అవకాశం దక్కింది. ఈ కామెడీ షో అనతికాలంలో సక్సెస్ అయ్యింది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భారీ క్రేజ్ రాబట్టింది. గ్లామర్ లవర్స్ కి అనసూయ తెగ నచ్చేసింది.

27
Jabardasth

అదే సమయంలో జబర్దస్త్ విమర్శలు ఎదుర్కొంది. ప్రారంభంలో డబుల్ మీనింగ్స్ జోక్స్ డోస్ ఎక్కువగా ఉండేది. ఒక దశలో జబర్దస్త్ అడల్ట్ కామెడీ షో అనే పేరు తెచ్చుకుంది. అనసూయ పొట్టిబట్టలు ధరించడం కూడా ఇందుకు ఒక కారణం. అనసూయకు ముందు తెలుగు యాంకర్స్ ఎవరూ ఎక్స్పోజింగ్ జోలికి పోలేదు. మోడరన్ బట్టలు ధరించినా శరీరాన్ని కప్పి ఉంచేవారు. 
 

37
Jabardasth Anasuya Bharadwaj


ఇంటిల్లిపాది కూర్చుని చూసే షోలో గ్లామర్ షో చేయడం, డబుల్ మీనింగ్స్ తో కామెడీ వివాదాస్పదం అయ్యింది. విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్న నేపథ్యంలో మల్లెమాల సంస్థ కమెడియన్స్ కి డబుల్ మీనింగ్ తో కూడిన అడల్ట్ జోక్స్ వద్దని సూచనలు చేసింది. ఆ తరహా కామెడీ తగ్గించాలని చెప్పడమైనది. 
 

47
Jabardasth Anasuya Bharadwaj


సంస్థ సూచనలతో చాలా వరకు టీమ్ లీడర్స్ డబుల్ మీనింగ్ కామెడీ జోలికి పోకుండా స్కిట్స్ రాసుకునేవాళ్ళు. అనసూయ మాత్రం తన గ్లామరస్ డ్రెస్సింగ్ కొనసాగించింది. ఇక కామెడీ పేరుతో లేడీ గెటప్స్ లో ఉన్న మగాళ్లను తన్నడం . స్త్రీలను అవమానించేలా జోక్స్ వేయడం కూడా వివాదస్పదం అయ్యింది. ఈ ఆరోపణల మీద ఓ ఇంటర్వ్యూలో అనసూయ స్పందించారు. ఆ మాటకు వస్తే 80-90లలో వచ్చిన సినిమాలలో సాహిత్యం సంగతి ఏంటని ఆమె ప్రశ్నించారు. 
 

57
Anasuya Bharadwaj

అందరు జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారు. డబుల్ మీనింగ్ జోక్స్ వేస్తున్నారు. మహిళలను కించపరుస్తున్నారు అని విమర్శలు చేస్తారు. ఈ విమర్శించేవాళ్ళు ఎప్పుడైనా 80-90లలో వచ్చిన సినిమాల్లోని సాంగ్స్ లిరిక్స్ విన్నారా? అసలు పచ్చిగా ఉంటాయి. కానీ అప్పుడు మీడియా అనేది ఇలా లేదు. మహానటి సావిత్రి చివరి రోజుల్లో దుర్భర జీవితం అనుభవించారు. మీడియా ఆమె వ్యవహారంలో బాధ్యతగా యుతంగా వ్యవహరించింది.. అని అనసూయ అన్నారు. 
 

67

అయితే జబర్దస్త్ ద్వారా అడల్ట్ జోక్స్ ని ఎంకరేజ్ చేసినందుకు నాకు బాధగా ఉంటుంది. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదు. కెరీర్ కోసం మనసొప్పకపోయినా జబర్దస్త్ చేశాను అన్న అర్థంలో అనసూయ మాట్లాడారు. ఇప్పుడీ మనం చేసే పనికి భవిష్యత్ లో బాధపడకూడదు... అనేది నా సిద్ధాంతం. దాదాపు అలానే బ్రతకాలి అనుకుంటాను, అన్నారు. గతంలో ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ ఈ కామెంట్స్ చేసింది. 

 

77

కాగా అనసూయ తన డ్రెస్సింగ్ పై వచ్చిన విమర్శలను ఎప్పుడూ పట్టించుకుంది లేదు. నా బట్టలు నా ఇష్టం అని పలుమార్లు విమర్శించిన వాళ్లకు కౌంటర్లు ఇచ్చింది. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. డేట్స్ కుదరకే మానేశానని మొదట్లో వివరణ ఇచ్చారు. టీఆర్పీ స్టంట్స్ నచ్చకే యాంకరింగ్ వదిలేశానని ఓ సోషల్ మీడియా ఛానల్ లో అనసూయ చెప్పడం విశేషం.. 

Read more Photos on
click me!

Recommended Stories