58 ఏళ్లు.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్.. ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

First Published Apr 17, 2024, 2:21 PM IST

తమిళంతో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు చియాన్ విక్రమ్.  ఈరోజు( ఏప్రిల్ 17) 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈస్టార్ హీరో ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?  

హీరోగా తమిళనాట స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు విక్రమ్. తెలుగులో కూడామంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న ఈ హీరో..  ఏప్రిల్ 17, 1966లో జన్మించారు. అతని తండ్రి పేరు వినోదరాజ్ మరియు తల్లి పేరు రాజేశ్వరి. విక్రమ్ అసలు పేరు  కెన్నెడీ. ఏర్కాడ్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన విక్రమ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. విక్రమ్ తన కాలేజ్ స్టడీస్ ను  చెన్నైలోని లయోలా కళాశాలలో చదివాడు. అప్పట్లో కాలేజీలో స్టేజి నాటకాల్లో కూడా నటించారు.

 రంగస్థల నాటకంలో తన పాత్రకు ఉత్తమ నటుడి అవార్డును కూడా గెలుచుకున్నాడు. అవార్డు అందుకున్న తర్వాత బైక్‌పై ఇంటికి వెళ్తున్న విక్రమ్‌కు అనుకోని ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. తదనంతరం, మూడేళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌కు 23 కుట్లు వేయాల్సి వచ్చింది. అంతే కాదు కాలుకు ఒక వైపు తీయవలసి వచ్చింది. అయినా  డాక్టర్ల కేర్ తో పాటు  దృఢ సంకల్పంతో విక్రమ్ మళ్లీ కోలుకున్నాడు. 

దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఆ హీరోనే..రూమ్ నిండా ఆ హీరోవి పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవట, ఎవరో తెలుసా..?
 

సినిమా రంగంలోకి అడుగు పెట్టిన విక్రమ్ హీరోగా నిలబడటానికి చాలా కష్టపడ్డాడు.  కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న విక్రమ్ 1990లో విడుదలైన ఎన్ కాదల్ కన్మణి సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టాడు. తండ్రి కూడా నటుడే కావడంతో సినిమాల్లోకి ఈజీగా అడుగుపెట్టిన విక్రమ్‌కి సక్సెస్ అంత తేలికగా రాలేదు. 
 

నయనతార వాచ్ కాస్ట్ వైరల్.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాదేమో.. లగ్జరీ వస్తువులు వాడుతున్న లేడీసూపర్ స్టార్..

పిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన  దాదాపు 9 ఏళ్ల తర్వాత శ్రీధర్, ఎస్.బి.ముత్తురామన్, బి.సి.శ్రీరామ్, షాజీ కైలాష్, విక్రమ్, పార్తీబన్ వంటి ఎందరో ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించారు. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో ఆయన స్టార్ గా మారాడు. 
 

మొదట్లో వరుస ఫ్లాపుల కారణంగా విక్రమ్ హిట్ లేని అన్ లక్ హీరోగా  ముద్ర పడ్డాడు. అయితే సినిమాపై ఉన్న అభిమానంతో  అన్ని కష్టాలు తట్టుకుని తన కెరీర్ ను కొనసాగించిన విక్రమ్.. హీరో అవకాశాలు రాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశాడు. ఆ దశలోనే విక్రమ్‌కి బాల  లైఫ్ ఇచ్చాడు. బాల దర్శకత్వంలో చేసిన  సేతు సినిమా విక్రమ్ ను హీరోగా నిలబెట్టింది.
 

Vikram

సేతు విజయం తర్వాత, విక్రమ్ దిల్,  సామి మరియు జెమిని వంటి వరుస హిట్‌లను అందించడంతో అగ్ర నటుడిగా ఎదిగాడు. 30 ఏళ్లకు పైగా సినీరంగంలో నటిస్తున్న విక్రమ్ ఈరోజు 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు అభినందనల వర్షం కురుస్తోంది. 

Vikram

తమిళ సినిమాలో ప్రయోగాలకు పెట్టింది పేరుగా నిలిచిన విక్రమ్ శివపుత్రుడు,అపరిచితుడు, ఐ, మల్లన్న, లాంటి ప్రయోగాత్మక సినిమాలెన్నో చేశారు. ఈసినిమాల వల్ల తెలుగు లో కూడా విక్రమ్ స్టార్ డమ్ సాధించాడు.  ఏ క్యారెక్టర్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చే విక్రమ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నాడట.  

ఇక  అతనికి చెన్నైలో విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. దీని విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇది కాకుండా ఎన్నో లగ్జరీ కార్లను కొని కూడబెట్టిన నటుడు విక్రమ్ నికర ఆస్తి విలువ 300  కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన  హీరోగా   తంగలాన్ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

click me!