జనాల ఆందోళనకు అదే కారణం.. వెంకీ చెప్పిన ఈ జీవిత సత్యాలు పాటిస్తే సమస్యే ఉండదు.

First Published | Jan 12, 2025, 1:59 PM IST

ఆస్తి, అంతస్తు, కీర్తి.. వీటన్నింటితో సంబంధం లేకుండా ప్రస్తుతం సమాజంలో ప్రతీ ఒక్కరిలో ఏదో తెలియని ఆందోళన, అభద్రత వెంటాడుతోంది. అయితే వీటన్నింటికీ ఒకటే కారణమని చెబుతున్నారు. విక్టరీ వెంకటేష్‌. తాజాగా ఆయన పాల్గొన్న ది రానా దగ్గుబాటి షోలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. 
 

photo credit- aha-unstoppable 4

విక్టరీ వెంటకేష్‌ హీరోగా తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ది రానా దగ్గుబాటి షో'కు చిత్ర యూనిట్‌ సందడి చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ ప్రోగ్రామ్‌ స్ట్రీమింగ్ అవుతోంది. 
 

ఈ ప్రోగ్రామ్‌లో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరితోపాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వెంకటేష్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో తాను ఎప్పుడూ నాలుగు విషయాలను పాటిస్తానని తెలిపారు. ప్రస్తుతం జనాలు ఎక్కువగా ఆందోళనకు గురికావడానికి కారణం వచ్చిన ఫలితాన్ని అంగీకరించలేకపోవడమేనని వెంకీ చెప్పుకొచ్చారు. సమస్యలన్నింటికీ ఇదే కారణమని అంటున్నారు. 
 


నాలుగు విషయాలు పాటించాలి..

జీవితంలో సంతోషంగా ఆందోళన తగ్గి, సంతోషంగా ఉండడానికి వెంకీ నాలుగు విషయాలు తెలిపారు. తాను కూడా జీవితంలో వాటిని పాటిస్తానని చెప్పుకొచ్చారు. కష్టపడటం.. నివేదించటం.. బయటకు వచ్చేయడం.. అంగీకరించడం.. వీటిని తాను కచ్చితంగా పాటిస్తానని తెలిపారు. ఏ పని చేసినా ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని వెంకీ తెలిపారు.

ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలి అని పూర్తి అయిన తర్వాత దాని ఫలితాన్ని ప్రపంచానికే వదిలేయాలన్నారు. ఈ రెండు ఎంత ముఖ్యమో బయటపడడం, ఫలితాన్ని అంగీకరించడం ఈ రెండూ అంతే ముఖ్యమని వెంకటేష్‌ తెలిపారు. నిత్యం ధ్యాన సాధన, గురువులు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్లే తనకు ఇది సాధ్యమైందని వెంకీ తెలిపారు. 
 

సంక్రాంతికి వస్తున్నాం..

సంక్రాంతికి వస్తున్నాం.. 

ప్రస్తుతం తాను నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా ఇదే వర్తిస్తుందని వెంకీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను కష్టపడి పూర్తి చేశానని, దానినుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చారు. ఇక ఫలితం ఏది వచ్చినా దాన్ని తీసుకుంటాన్న వెంకీ.. ప్రస్తుతం జనాలు ఆందోళనపడటానికి కారణం వారి జీవితంలో జరిగే వాటిని అంగీకరించలేకపోవడమే అని జీవిత సత్యాన్ని చెప్పొకొచ్చారు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్టాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్‌ కొత్తగా ఉంటాయని, ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతిని ఇస్తాయని చెప్పుకొచ్చారు..అనిల్‌ రావిపూడితో తక్కువ సమయంలో మూడు సినిమాలు చేయటం ఆనందంగా ఉందన్న వెంకీ.. ఏడాది విడిచి ఏడాది అనిల్‌తో సినిమా చేస్తాని హామీ ఇచ్చారు. 
 

వెంకీ ఫిలాసఫి వేరు..

ఇక వెంకీ గతంలోనూ తన ఫిలాసఫికి సంబంధించి ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా హిట్టయితే పొంగిపోననని, ఫ్లాప్‌ అయితే కుంగిపోనని పని చేసేప్పుడు ఆనందంగా ఉన్నాను కదా అని తెలిపారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పే వెంకీ.. సినిమాలతో వచ్చిన విజయం తనకు పెద్దగా ఆనందాన్ని ఇవ్వలేదన్నారు. జీసెస్‌, రమణమహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస.. అందరి పుస్తకాలు చదివిన తర్వాత తన అన్వేష ఫలించిందని తెలిపారు. 

అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందన్న వెంకీ.. ఏదీ శాశ్వతం కాదని, ఎదుగుదల బాహ్యంగానే కాదు అంతర్ముఖంగానూ ఉండాలి అని తెలుసుకున్నాన్నారు. అలౌకిక ఆనందం కోసం తానుం ఎంచుకున్న మార్గం ధ్యానం అన్నారు. ధ్యానం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని, లేకపోతే జీవితానికి అర్థం లేదనిపిస్తోందని గతంలో పంచుకున్నారు. మన పనిని నిజాయతీగా చేయడం వరకే. ఫలితం ఏదైనా బాధపడకూడదు. ఈ ప్రపంచమనే నాటకరంగంలో మనమంతా పాత్రధారులం. మన పాత్రను చేయగలిగినంత బాగా చేయాలి. పూర్తికాగానే వెళ్లిపోవాలి. ఇది అర్థం చేసుకుంటే అంతా ఆనందమే తన తల ఫిలాసపిని ఇలా చెప్పుకొచ్చారు. 

Latest Videos

click me!