సుధీర్, రష్మి నిజంగానే ప్రేమించుకున్నారని అంతా నమ్మారు. ఈ ఇద్దరు కూడా షోలో లవ్ ట్రాక్‌లు నడిపించారు. లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం, ప్రపోజ్‌లు, రొమాంటిక్ సాంగ్‌లతో డాన్సులు, స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. నిజమైన లవ్ కపుల్స్ గా రక్తికట్టించారు.
అంతే బాగా తమ మధ్య కెమిస్ట్రీని పండించారు. దీంతో ఫ్యాన్స్ అంతా వీరు నిజంగానే లవ్ లో ఉన్నారని, ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌లు వచ్చాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్‌కి మించిన రిలేషన్ అంటూ కవర్ చేసుకుంటూ వచ్చారు.