డ్యామేజ్ కంట్రోల్.. 'గేమ్ ఛేంజర్' లో నానా హైరానా పాటను జోడించిన చిత్ర యూనిట్

First Published | Jan 12, 2025, 1:53 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలైన థియేటర్స్ లో సందడి చేస్తోంది. శంకర్ రీసెంట్ మూవీస్ కంటే గేమ్ ఛేంజర్ బెటర్ అనే టాక్ వచ్చింది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలైన థియేటర్స్ లో సందడి చేస్తోంది. శంకర్ రీసెంట్ మూవీస్ కంటే గేమ్ ఛేంజర్ బెటర్ అనే టాక్ వచ్చింది. అదే క్రమంలో మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. రాంచరణ్ ఫ్లాష్ బ్యాక్ లో పోషించిన అప్పన్న పాత్రకి మాత్రం అందరూ జేజేలు కొడుతున్నారు. మిక్స్డ్ టాక్ కూడా ఉండడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. 

రిలీజ్ కి ముందు సూపర్ హిట్ అయిన నానా హైరానా సాంగ్ ని మూవీలో యాడ్ చేయలేదు. సాంకేతిక కారణాల వల్ల ఆ పాటని జోడించడం సాధ్యం కాలేదని చిత్ర యూనిట్ చెప్పారు. జనవరి 14 నుంచి ఆ పాటని యాడ్ చేయబోతున్నట్లు తెలిపారు. కానీ టాక్ సరిగ్గా లేకపోవడంతో డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు మొదలయ్యాయి. అనుకున్న సమయానికంటే ముందుగానే నానా హైరానా సాంగ్ ని గేమ్ ఛేంజర్ మూవీలో యాడ్ చేశారు. 


ఆదివారం నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు. సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుంది.రామ్ చ‌ర‌ణ్ రామ్ నంద‌న్‌, అప్పన్న పాత్ర‌ల్లో ఒదిగిపోయి ఓ వైపు స్టైలిష్‌గా, మ‌రో వైపు పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆక‌ట్టుకున్నారు. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చ‌ర‌ణ్‌-ఎస్‌.జె.సూర్య మ‌ధ్య ఉండే ఎగ్జ‌యిటింగ్ స‌న్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్-కియారా కెమిస్ట్రీ, అంజ‌లి అద్భుతమైన నటనకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో స్పెష‌లిస్ట్ అయిన శంక‌ర్ త‌న‌దైన పంథాలో గేమ్ చేంజ‌ర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండ‌ర్ మూవీగా ఆవిష్క‌రించారు.

గేమ్ చేంజ‌ర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, తిరు ఎక్స్‌ట్రార్డినరీ విజువ‌లైజేష‌న్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి.  ఈ సినిమాను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Latest Videos

click me!