ఇద్దరు యంగ్ హీరోలు చిరంజీవికి కంప్లైంట్ చేసి హీరోయిన్లని ఓ సినిమాలో మార్చుకున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు ? ఇంతకీ ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అన్నయ్య ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్రదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకుంది. బ్రదర్ సెంటిమెంట్ కి తోడు చిరంజీవి కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్, సౌందర్యతో కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటాయి.
25
అన్నయ్య మూవీలో సౌందర్య చెల్లెళ్ళు
ఈ మూవీలో చిరంజీవి బ్రదర్స్ గా హీరో వెంకట్, మాస్ మహారాజ్ రవితేజ నటించారు. సౌందర్యకి కూడా ఈ మూవీలో సిస్టర్స్ ఉంటారు. చాందిని, సిస్వ సౌందర్యకి చెల్లెళ్లుగా రవితేజ, వెంకట్ లకు జోడీలుగా నటించారు. చాందిని, సిస్వ విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని హీరో వెంకట్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. వాస్తవానికి అన్నయ్య మూవీలో నాకు పెయిర్ గా చాందిని నటించాలి.
35
హీరోయిన్ తో గొడవ
నా ఫస్ట్ మూవీ శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండిలో చాందిని నాకు హీరోయిన్ గా నటించింది. మా కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ షూటింగ్ లో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళం. అప్పుడు మా ఏజ్ తక్కువ కావడంతో మెచ్యూరిటీ లేదు. దీనితో చీటికి మాటికి గొడవ పడుతూ డైరెక్టర్ దగ్గర పంచాయతీ పెట్టేవాళ్ళం. అన్నయ్యలో కూడా నాకు పెయిర్ గా ఆమెనే ఎంపిక చేశారు. రవితేజకి పెయిర్ గా సిస్వని ఎంపిక చేశారు.
బాబోయ్ ఆమె నాకు పెయిర్ గా వద్దు అంటూ అన్నయ్య చిరంజీవి గారి దగ్గరకు వెళ్ళాను. ఆమెతో నాకు ఎప్పుడూ గొడవలే కాబట్టి ఆమెని రవితేజకి పెయిర్ గా పెట్టి నాకు సిస్వని పెయిర్ గా ఇవ్వండి అని అన్నయ్యని రిక్వస్ట్ చేసినట్లు వెంకట్ తెలిపారు. దీనితో చిరంజీవి అంగీకరించారు అని వెంకట్ తెలిపారు.
55
పవన్ కళ్యాణ్ ఓజీలో..
హీరో వెంకట్.. పవన్ కళ్యాణ్ ఓజీలో కీలక పాత్రలో నటించారు. ఇటీవల వెంకట్ కి అవకాశాలు తగ్గాయి. రీసెంట్ గా వెంకట్ హీరోగా హరుడు అనే మూవీలో నటించారు. ఆ సినిమా వర్కౌట్ కాలేదు.