Hanuman Ansh Telugu Collections: హనుమాన్‌ అంశ్‌ తెలుగులో డల్‌ కలెక్షన్లు.. టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?

Published : Oct 10, 2026, 08:53 AM IST

Hanuman Ansh Telugu Collections: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `హనుమాన్‌ అంశ్‌` మూవీ తెలుగులోకి వచ్చింది. మరి తెలుగు వెర్షన్‌ సినిమాకి మన ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఆదరణ ఉంది, ఎంత కలెక్షన్లని రాబట్టిందనేది చూస్తే,

PREV
14
తెలుగులోకి వచ్చిన హనుమాన్‌ అంశ్‌

హనుమాన్‌ అంశ్‌ మూవీ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డెడ్‌ స్లోగా స్టార్ట్ అయిన ఈ మూవీ పదిహేను రోజుల తర్వాత పుంజుకుంది. ఇక థియేటర్ల నుంచి తీసేద్దామనుకున్న టైమ్‌లో ఊపందుకుంది. సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఐదు వందల కోట్ల దిశగా వెళ్తోంది. ఈ క్రమంలో హిందీలో రూపొందిన ఈ మూవీని తాజాగా తెలుగులోకి డబ్‌ చేసి ఈ శుక్రవారం విడుదల చేశారు.

24
హనుమాన్‌ అంశ్‌ తెలుగు వెర్షన్‌ కలెక్షన్లు

తెలుగు వెర్షన్‌లో ఈ మూవీకి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఆడియెన్స్ నుంచి పెదవి విరుపు కనిపిస్తోంది. అయితే హిందీ వెర్షన్‌ మూవీని తెలుగు ఆడియెన్స్ చాలా వరకు చూశారు. ఆథ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే వాళ్లు చూశారు. సినిమా కలెక్షన్లని చూసి కొంత మంది చూశారు. పైగా రెండు నెలల తర్వాత తెలుగులోకి రావడంతో పెద్దగా ఆదరణ దక్కలేదు. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.60లక్షలు మాత్రమే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా(64వ రోజు) ఈ మూవీ కోటీ నలభై లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక థియేట్రికల్‌గా క్లోజ్‌కి చేరుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దసరా హాలీడేస్‌ ఉన్న నేపథ్యంలో మళ్లీ పుంజుకునే ఛాన్స్ కనిపిస్తుంది.

34
హనుమాన్‌ అంశ్‌ టోటల్‌ వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు

ఆగస్ట్ 7న విడుదలైన ఈ మూవీ 64 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.428.82కోట్లు వచ్చాయి. ఇండియాలో దీనికి రూ.388.77కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో నలభై కోట్ల వరకు వచ్చాయి. లాంగ్‌ రన్‌లో ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్‌ సినిమాకి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. ప్రమోషన్స్ లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ కావడం కూడా కష్టమనే టాక్‌ వినిపిస్తోంది.

44
హనుమాన్‌ అంశ్‌ తెలుగులో మ్యాజిక్‌ చేస్తుందా?

నీమ్‌ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఆయన పదేళ్ల వయసు నుంచి ఇంటిని వదిలి దేశం మొత్తం పలు పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను సందర్శిస్తాడు. అనేక మంది సాధువులను కలుస్తాడు. ఈ క్రమంలో అనంతమైన జ్ఞానం పొందుతాడు. భవిష్యత్‌ని ముందే ఊహిస్తాడు. దైవశక్తిని పొందుతాడు. ఈ క్రమంలో ఆయన దేశమంతా పలు ప్రాంతాలు తిరిగి నీమ్‌ కరోలిలో కొలువైతాడు. సినిమా జెన్యూన్‌ గా చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. మహిమలు లేవు, దేవుడి లీలలు లేవు. దీంతో చప్పగా సాగినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో స్లోగా వెళ్తుంది. ఓవరాల్‌గా డాక్యుమెంటరీ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రానికి విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించగా, నీమ్‌ కరోలి బాబా పాత్రలో శోభినవ్‌ సత్య నటించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories