మ్యాన్లీ హీరో శ్రీకాంత్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరో. ఫ్యామిలీ సినిమాలతోనే ఆయన హీరోగా నిలబడ్డాడు. మహిళల ఆదరణ పొందాడు. అప్పట్లో ఫ్యామిలీస్‌లో శ్రీకాంత్‌కి యమ క్రేజ్ ఉండేది. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్‌లకు దీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, జేడీ చక్రవర్తి వంటి వారితో సమకాలీకులుగా రాణించారు. మార్కెట్ వైజ్, ఇమేజ్ వైజ్ సెకండ్ లెవల్ హీరోగా మెప్పించారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీకాంత్ హీరోగా, విలన్‌గా, హీరోగా మల్టీస్టారర్లతోపాటు, బలమైన పాత్రల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్నుంచి ఆయన హీరోగానే చేయాలనే లిమిట్స్ పెట్టుకోలేదు. పాత్ర డిమాండ్ మేరకు ఎలాంటి సినిమాలైనా చేశారు. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల `స్కంధ`, `దేవర` చిత్రాల్లో బలమైన పాత్రలతో ఆడియెన్స్ ని అలరించారు. నటుడిగా ఓ సెపరేట్ ఇమేజ్ ఉన్న పాత్రలు చేస్తూ తన విలక్షణతని చాటుకుంటున్నారు శ్రీకాంత్.
ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఆయన కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్‌ని మళ్లీ మామూలు మనిషిని చేయడంలో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది. శ్రీకాంత్‌ని చిరంజీవి సొంత తమ్ముడిలా భావిస్తారు. అలాగే శ్రీకాంత్ సైతం చిరుని సొంత అన్నయ్యలా భావిస్తారు.
ఇటీవల శ్రీకాంత్ పుట్టిన రోజుకి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించాడు చిరంజీవి. తన ప్రేమని, అనుబంధాన్ని చాటి చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య అనుబంధం ఇంతగా బలపడటానికి మరో కారణం ఉందట. ఆ విషయాన్ని శ్రీకాంత్ వెల్లడించారు. ఆ సమయంలో చిరంజీవి అన్నయ్య పిలవకపోతే తన పరిస్థితి వేరేలా ఉండేదన్నారు శ్రీకాంత్.
ఓ దశలో తాను వరుసగా పరాజయాలు చవిచూశాడట. ఏ సినిమా చేసినా ఫెయిల్ అవుతుందట. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా లో అయిపోయాడట. ఎంతో బాధపడుతున్నాడట. ఇలా తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు శ్రీకాంత్. తాను డల్‌గా ఉండటాన్ని గమనించిన చిరంజీవి పిలిపించాడట. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ విషయం తెలియగానే శ్రీకాంత్‌ని పిలపించాడట. ఏంటి డల్‌గా ఉన్నావ్, ఏం జరిగిందంటే? ఇలా వరుసగా సినిమాలు పోతున్నాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త సినిమాలు ఒప్పుకోవాలంటే భయమేస్తుందన్నాడట. ఇలా వరుస ఫ్లాప్‌ల వల్ల శ్రీకాంత్‌కి సినిమా ఆఫర్లు తగ్గాయి, ఆయన్ కూడా తగ్గించాడు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీకాంత్ డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి పిలిపించి ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ చెప్పారట. తనకు జరిగిన సంఘటనలు, తాను ఫేస్ చేసిన సంఘటనలన్నీ చెప్పాడట చిరు. హిట్లు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో, ఫ్లాప్‌లు వచ్చినప్పుడు అంతే స్పోర్టీవ్‌గా తీసుకోవాలని తెలిపాడట చిరంజీవి.
ప్రతి హీరోకి పరాజయాలు వస్తాయని, వాటి గురించే ఆలోచించే మంచి సినిమాలు చేయలేం, మనం అక్కడే ఆగిపోతాం, కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. మొత్తంగా అందరు ఇబ్బంది పడతారు, నువ్వే ధైర్యంగా ముందుకెళ్లాల్సి, ఇలా డిప్రెషన్‌కి గురి కావద్దంటూ చెప్పడంతో శ్రీకాంత్‌లో ఎనర్జీ వచ్చిందని, అప్పట్నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని, జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చారు శ్రీకాంత్.
ఇప్పుడు హీరోగా సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. నెగటివ్, పాజిటివ్ పాత్రలు చేస్తున్నారు. సినిమాల్లో బలమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఇక చిరంజీవి, శ్రీకాంత్ కూడా కలిసి నటించారు. `శంకర్ దాదా ఎంబీబీఎస్`, `శంకర్ దాదా జిందాబాద్` సినిమాల్లో చిరంజీవికి రైట్ హ్యాండ్‌గా శ్రీకాంత్ చేసి మెప్పించాడు. అప్పట్లో వీరి కాంబోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఆ హీరోయిన్ పెద్ద సోమరిపోతూ, ఎప్పుడూ షూటింగ్‌లకు లేట్, నాగార్జునని ఇబ్బంది పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?