ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాల్లో బిజీగా మారిపోయాడు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించేసింది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వె సిరీస్ లో నటించింది. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ ఆమె ప్రకటించలేదు. పైగా ఇటీవల ఆమె కాలుకి దెబ్బ తగలడంతో రెస్ట్ తీసుకుంటూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే .. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు. నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. లావణ్య ఇటీవలి ఫొటోలే ఈ ప్రచారానికి కారణం అయ్యాయి. వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లావణ్య సంప్రదాయంగా పట్టు బట్టలో మెరిసిపోతూ కనిపించింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.