#Sankranti2025 :ఈ సారి పెద్ద పండగకు పెద్ద సినిమాలు, లిస్ట్ ఇదిగో

First Published | Oct 14, 2024, 3:25 PM IST

2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' మూవీతో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' తో పాటు వెంకటేష్ 'సైంధవ్', నాగార్జున హీరోగా నటించిన ' నా సామి రంగ' 

Game Changer, balakrishna, ramcharan, ajith

తెలుగు చిత్ర పరిశ్రమ కు కాసులు కురిపించే సీజన్  సంక్రాంతి పండగ .  కరోనా సమయంలోనూ సంక్రాంతి సీజన్ కు విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. లాస్ట్ ఇయిర్ సంక్రాంతి వచ్చిన సినిమాలు దుమ్ము దులిపాయి.

అందుకే ఈసారి మ్యాగ్జిమమ్ స్టార్స్ సంక్రాంతి సీజన్ కు సై అంటున్నారు. ఈసారి సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని పోటీ కనిపించనుంది. ఎందుకంటే ఒక వైపు మెగా  పవర్ స్టార్ మరో వైపు బాలయ్య సినిమా ఇంకో వైపు అజిత్ సినిమా ఓ వైపు. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ ఫామ్ చేసారు. 


2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' మూవీతో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' తో పాటు వెంకటేష్ 'సైంధవ్', నాగార్జున హీరోగా నటించిన ' నా సామి రంగ' సినిమాలు విడుదలైతే వాటిలో  హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' యావరేజ్ అనిపించుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంభందం లేకుండా కలెక్షన్స్ సాధించింది.   వెంకటేష్ సైంధవ్ సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర దారితప్పింది. ఈ క్రమంలో 2025 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయనే  విషయమై ట్రేడ్ లో క్లారిటీ వచ్చేసింది. 


bus accident


 2025 సంక్రాంతి బరిలో ఆరు సినిమాలు దిగుతున్నాయి. మొదటి నుంచి అనకున్నట్లు కాకుండా ఇప్పుడు చిరంజీవి పోటి నుంచి తప్పుకోవటంతో  తాజా సంక్రాంతి సమీకరణాలు మారిపోయాయి. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా రెండు మూడు రోజుల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ తో పాటుగా విడుదల కానుంది. బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సందీప్ కిషన్ మజాకాలు బరిలో ఉండబోతున్నాయి. ఆ లిస్ట్ చూద్దాం.

chankya niti


January 10th: రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ 

రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో క్రిస్మస్ పండగకు కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.  మూడేళ్ళ నుంచి నిర్మాణంలో ఉంటూ విపరీతమైన అంచనాలు మోస్తున్న

ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీ జనవరిలో రావడమే సబబని భావించి విశ్వంభర నిర్మాతలైన యువి బృందంతో పాటు చిరంజీవిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అనౌన్స్ మెంట్ ని వీడియో రూపంలో చేశారు.
 

chankya niti


January 12th: బాలకృష్ణ సర్కార్ సీతారాం 

 ననందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానున్నట్లు మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అలాగే  'NBK 109' అనే వర్కింగ్​ టైటిల్​తో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రానికి మేకర్స్ రెండు టైటిల్స్ ను పరిశీలించారట.

'డాకూ మహారాజా', 'సర్కార్ సీతారామ్' అనే రెండు వెరైటీ టైటిల్స్​లో ఈ సినిమాకు ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట. మాగ్జిమం 'సర్కార్ సీతారామ్' కావచ్చు అంటున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్‌ విలన్ రోల్ లో మెరవనున్నారు.
 

chankya niti


January 14th: వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం 

విక్టరీ వెంకటేష్ (Venkatesh), యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) లది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్), 'ఎఫ్ 3' భారీ విజయాలు సాధించాయి. ఆ రెండిటినీ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు.

ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మూడో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం'టైటిల్ తో రూపొందుతున్న ఈ  సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో ఆయన భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా... యువ కథానాయిక మీనాక్షి చౌదరి మరో  హీరోయిన్ గా సందడి చేయనున్నారు. ముక్కోణపు క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి హీరో మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు.

chankya niti

January 14th:సందీప్ కిషన్ మజాక

యంగ్ హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం   'మజాకా' .  ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పెళ్లికొడుకు గెటప్ లో కనిపిస్తున్నాడు. అతని చుట్టూ పెళ్లి హడావుడి కనిపిస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు.  

chankya niti


 అజిత్ గుడ్ బ్యాడ్  అగ్లీ  

 అజిత్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా సంక్రాంతికి విడుదల కానుంది. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్‌ ఫోటోని ని రిలీజ్ చేశారు నిర్మాతలు. అజిత్ స్టయిలీష్ గా ఉన్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

chankya niti

చిరంజీవి సినిమా సంక్రాంతి నుంచి వాయిదా

ముందుగానే చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' మూవీని జనవరి 10న విడుదల చేస్తున్నట్టు అందరి కంటే ముందుగానే అనౌన్స్ చేశారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా కోసం సమ్మర్ కు వాయిదా వేసారు.

  యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ కావడం గమనార్హం. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే హిట్ అనిపించుకున్నాయి. కానీ సాలిడ్ ప్యాన్ ఇండియా రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇపుడు వశిష్ఠతో చేస్తోన్న సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకోవాలనే కసి మీదున్నారు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష యాక్ట్ చేస్తోంది.

Latest Videos

click me!