టాలీవుడ్ లో ఏ ఇతర హీరోల సినిమాలతో కంపేర్ చేయలేనంతగా.. భారీగా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి.ఇప్పటి వరకూ రామ్ కు సబంధించిన 9 సినిమాలు హిందీ వెర్షన్ లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను చాలా సునాయాసంగా దాటాయి. అవేమిటంటే.. ఇస్మార్ట్ శంకర్, స్కంద, హలో గురు ప్రేమ కోసమే, వున్నది ఒకటే జిందగీ, పండగ చేస్కో, గణేష్, హైపర్, నేను శైలజా వంటి సినిమాలు ఉన్నాయి. హిందీలో ఇవి 100 మిలియన్ వ్యూస్ ని దాటేశాయి. కొన్ని సినిమాలైతే మూడు వందలు, నాలుగు వందలు, ఐదు వందల మిలియన్ మార్క్ ని కూడా అందుకుని సంచలనం రేపుతున్నాయి.