రాజమౌళి సినిమాలంటే అసలు ఇష్టం లేని సీనియర్ హీరో..షాకింగ్ రీజన్, ఆయన డైరెక్షన్ లో నటించినప్పటికీ ఇలా 

First Published | Jul 27, 2024, 11:35 AM IST

భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగం అయ్యారు.

80, 90 దశకాల్లో రాణించిన తెలుగు హీరోల్లో భానుచందర్ ఒకరు. భానుచందర్ ఎక్కువగా ఫీల్ గుడ్ మూవీస్ తో గుర్తింపు పొందారు. అప్పట్లో సంగీత దర్శకుడిగా రాణించిన మాస్టర్ వేణు కుమారుడే భానుచందర్. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

భానుచందర్ ఫ్యామిలీ రాజమండ్రికి చెందినవారు. భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగం అయ్యారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో భానుచందర్ నటించిన సూత్రధారులు చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. 

Latest Videos


ప్రస్తుతం భానుచందర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భానుచందర్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భానుచందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాలంటే తనకి అసలు ఇష్టం లేదని అన్నారు. నాకు రాజమౌళి సినిమాలు నచ్చనంత మాత్రాన ఆయన మంచి దర్శకుడుకాదు అని అర్థం కాదు. ఆయన గొప్ప దర్శకుడే.. కానీ ఆయన తెరకెక్కించే చిత్రాలు నాకు నచ్చవు. 

ఆ తరహా చిత్రాలకు నేను అభిమానిని కాదు. అంతే కాదు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రం కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. కె విశ్వనాథ్, బాలచందర్ లాంటి దర్శకుల సినిమాలంటేనే నాకు ఇష్టం. వారి చిత్రాల్లో భావోద్వేగాలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. కానీ రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తీసుకున్నా ఆ ఎమోషన్ తో నేను కనెక్ట్ కాలేను అని భానుచందర్ అన్నారు. 

రాజమౌళి సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదు. కొందరికి కొన్ని చిత్రాలు నచ్చుతాయి.. కొందరికి నచ్చవు.. నాకు రాజమౌళి సినిమాలు నచ్చవు అని తేల్చేశారు. బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాల్లో ఒక్క సీన్ కూడా నా హృదయాన్ని కదిలించలేకపోయాయి. అలాంటప్పుడు ఆ చిత్రాలు నాకు ఎలా నచ్చుతాయి అని భానుచందర్ అన్నారు.

click me!