`హరి హర వీరమల్లు` పార్ట్ 2 టైటిల్‌ ఇదే.. షూటింగ్‌ అప్‌ డేట్‌, రిలీజ్‌ ఎప్పుడంటే?

Published : Jul 24, 2025, 11:35 AM ISTUpdated : Jul 24, 2025, 11:43 AM IST

`హరి హర వీరమల్లు` మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ పార్ట్ 2 టైటిల్‌ లీక్‌ అయ్యింది. 

PREV
15
థియేటర్లలో సందడి చేస్తోన్న `హరి హర వీరమల్లు`

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఐదేళ్లు పురిటినొప్పులు అనుభవించి ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 

నేడు గురువారం ఈ చిత్రం ప్రపంచ వాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అసలు రిజల్ట్ ఏంటనేది ఈ రోజు తేలనుంది.

25
`హరి హర వీరమల్లు` రిజల్ట్ ఏంటంటే?

`హరి హర వీరమల్లు`లో పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన ఎలివేషన్స్  బాగున్నాయి. పాటలు ఓకే అనిపించాయి. బీజీఎం చాలా కొత్తగా ఉంది. అదొక హైలైట్‌గా నిలిచింది. 

దీనికితోడు విజువల్స్ మరో అసెట్‌గా చెప్పొచ్చు. చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. థియేటర్ ఎక్స్ పీరియెన్స్ వాహ్‌ అనిపిస్తుంది. కాకపోతే స్లోగా ఉండటం, సెకండాఫ్‌లో కాస్త డల్ గా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. 

ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వాల్సింది.  క్లైమాక్స్ ముగింపు ఇంకా బాగా చేయాల్సింది. ఓవరాల్‌గా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ అనే చెప్పాలి. 

35
`హరి హర వీరమల్లు` మూవీ రెండో పార్ట్ టైటిల్‌

ఇదిలా ఉంటే `హరి హర వీరమల్లు` రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదలైంది మొదటి పార్ట్. `యుద్ధం వర్సెస్‌ ధర్మం` అనే ట్యాగ్‌ లైన్‌తో దీన్ని రూపొందించారు. 

ఇక ఈ మూవీకి రెండో పార్ట్ కూడా ఉంది. ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. 

అదే సమయంలో రెండో పార్ట్ టైటిల్‌ని రివీల్‌ చేశారు. దీనికి `యుద్ధభూమి`గా నిర్ణయించారు. `హరి హర వీరమల్లుః యుద్ధభూమి` పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కించనున్నారు.

45
వీరమల్లుకి ఔరంగజేబ్‌కి మధ్య యుద్ధమే రెండో పార్ట్

వీరగా నటించిన పవన్‌ కళ్యాణ్‌, ఔరంగజేబ్‌గా నటించిన బాబీ డియోల్‌ ఎదురుపడటంతో మొదటి భాగం ముగుస్తుంది. ఆ ఎదురుపడే సీన్‌ పీక్‌లో ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చోటు చేసుకునే యుద్ధమే రెండో పార్ట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. 

అయితే ఈ రెండో పార్ట్ కి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ కూడా వెల్లడించింది టీమ్‌. ఇప్పటికే 20 నుంచి 30 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేసినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్‌. 

ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. రెండో భాగం ఉంటుందా? లేదా అనేది మొదటి పార్ట్ సక్సెస్‌ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

సినిమా బాగా ఆడితే కొనసాగిస్తామని, లేదంటే ఉండబోదనే విషయాన్ని పవన్‌ చెప్పకనే చెప్పేశారు. కానీ చూడబోతుంటే రెండో పార్ట్ రావడం కష్టమే అని చెప్పొచ్చు.

55
`హరి హర వీరమల్లు` టీమ్‌ ఇదే

పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా నటించిన `హరి హర వీరమల్లు` చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాకి సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. 

ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, ఔరంగజేబ్‌గా, నెగటివ్‌ రోల్‌లో బాబీ డియోల్‌ నటించారు. సునీల్‌, నాజర్‌, రఘుబాబు, కబీర్‌సింగ్‌ వంటివారు ముఖ్య పాత్రలు పోషించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories