పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ గత నెలలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హిస్టారికల్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ జులై 24న భారీగా విడుదలైంది. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఆ అంచనాలు భారీగానే ఉన్నాయి. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్‌ఎక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో ఎమోషన్స్ పండలేదనే టాక్ వినిపించింది. దీనికితోడు ఐదేళ్లుగా సినిమా తీయడంతో కొంత కంటిన్యూటీ కూడా మిస్ అయ్యింది.
DID YOU KNOW ?
తొలి పాన్ ఇండియా మూవీ
`హరి హర వీరమల్లు` పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. అదే సమయంలో తొలి హిస్టారికల్ చిత్రం కావడం విశేషం.
25
`హరి హర వీరమల్లు` మూవీ కలెక్షన్లు
మొత్తంగా `హరి హర వీరమల్లు` బాక్సాఫీసు వద్ద నిరాశపరిచిందని చెప్పొచ్చు. ఈ మూవీ సుమారు రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. రిలీజ్‌కి ముందు థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ. 126కోట్లు వచ్చాయి. అలాగే ఓటీటీ రూపంలోనూ భారీగానే వచ్చింది. ఇక దాదాపు రూ.130కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీగానే రాబట్టుకున్నా, ఆ తర్వాత డీలా పడిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గాయి. దాదాపు మూడు వారాలపాటు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఫైనల్‌గా వరల్డ్ వైడ్‌గా రూ.118కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టింది. సుమారు రూ.60కోట్ల షేర్ వచ్చింది.
35
`హరి హర వీరమల్లు` బిగ్గెస్ట్ లాస్
`హరి హర వీరమల్లు` మూవీ నిర్మాతలకు, బయ్యర్లకి సుమారు రూ.60కోట్ల వరకు నుంచి ఎనభై కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కూడా పారితోషికం తీసుకోలేదు. అడ్వాన్స్ రూపంలో కొంత తీసుకున్నా, దాన్ని మళ్లీ వెనక్కి ఇచ్చేశారు. సినిమా విడుదలయ్యాక, ఆడితే తీసుకుంటానని తెలిపారు. సినిమా ఆడకపోవడంతో ఆయన పారితోషికం లేకుండానే ఈ సినిమా చేశాడని చెప్పొచ్చు. ఇక ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఏఎం రత్నం నిర్మించారు.
మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన `హరి హర వీరమల్లు` ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. ఈ రాత్రి నుంచే ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్ట్ 20(బుధవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ఈ అర్థ రాత్రి నుంచి ఓటీటీ రచ్చ చేయబోతుంది. మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈ మూవీ ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఓటీటీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
55
`హరి హర వీరమల్లు ` మూవీ కథ ఇదే
`హరి హర వీరమల్లు` మూవీ కొహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది. అదే సమయంలో దీన్ని మొఘల్ రాజు ఔరంగ జేబ్ ఆగడాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకించిన రాజులను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆయనకు వ్యతిరేకంగా వీరమల్లు పోరాటం చేస్తుంటారు. అదే సమయంలో ఔరంగ జేబు వద్ద ఉన్న కొహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు ఢిల్లీకి బయలుదేరడం, ఈ జర్నీలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఫేస్ చేసిన అనుభవాల ప్రధానంగా ఈ సినిమా సాగింది.