ప్రభాస్‌ సినిమాలను దాటేసిన `మహావతార్‌ నరసింహ`.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేక్‌ .. 26 రోజుల్లో ఎంత వచ్చాయంటే

Published : Aug 19, 2025, 08:09 PM IST

`మహావతార్‌ నరసింహ` యానిమేషన్‌ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది.ఈ సినిమా భారీ వసూళ్లని రాబడుతోంది. తాజాగా ప్రభాస్‌ సినిమాలను దాటేయడం విశేషం. 

PREV
15
`మహావతార్‌ నరసింహ` కలెక్షన్లు

మైథలాజికల్‌ యానిమేషన్‌ మూవీ `మహావతార్‌ నరసింహ` ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఇండియా వైడ్‌ గా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఏకంగా మూడు వందల కోట్ల మార్క్ కి చేరుకుంటోంది. మొదటి రోజు రూ.1.75కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు మూడు వందల కోట్లకు చేరువలో ఉండటం విశేషం.

DID YOU KNOW ?
ది రాజాసాబ్‌తో రాబోతున్న ప్రభాస్‌
ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. మారుతి రూపొందిన ఈ మూవీ డిసెంబర్‌ 5న విడుదల కానుంది.
25
ప్రభాస్‌ సినిమాలను దాటేసిన `మహావతార్‌ నరసింహ`

అంతేకాదు `మహావతార్‌ నరసింహ` మూవీ పలు బాక్సాఫీసు రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. ఈ చిత్రం తాజాగా ప్రభాస్‌ మూవీ కలెక్షన్లని దాటేయడం విశేషం. హిందీ బెల్ట్ లో ప్రభాస్‌ నటించిన రెండు సినిమాల కలెక్షన్లని దాటేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరి ఇంతకి ఈ చిత్రం ప్రభాస్‌ నటించిన ఏ సినిమాల రికార్డులు బ్రేక్‌ చేసిందో తెలుసుకుందాం.

35
నార్త్ లో ప్రభాస్‌కి భారీ మార్కెట్‌

ప్రభాస్‌కి నార్త్ లో సాలిడ్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అదే సమయంలో మంచి మార్కెట్ ఏర్పడింది. డివైడ్ టాక్‌ వచ్చిన చిత్రాలు కూడా అక్కడ భారీగా వసూలు చేస్తున్నాయి. `బాహుబలి 2` ఏకంగా ఐదు వందల కోట్లు దాటింది.  గతేడాది వచ్చిన `కల్కి 2898 ఏడీ` కూడా సుమారు. రూ.280కోట్లు రాబట్టింది. అలాగే `సాహో` మూవీ హిందీలో `రూ.150కోట్లు వసూలు చేసింది. మరోవైపు `సలార్‌` రూ.153కోట్లు రాబట్టింది.

45
`సాహో`, `సలార్‌`లా కలెక్షన్లని దాటేసిన `మహావతార్‌ నరసింహ` మూవీ

ఈ క్రమంలో ఇప్పుడు `మహావతార్ నరసింహ` మూవీ `సాహో`, `సలార్‌` రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.160కోట్లు రాబట్టింది. హిందీలోనే ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లు రావడం విశేషం. ఈ సినిమాకి ఇండియాలోనే రూ.250కోట్లు వచ్చాయి. తెలుగులో రూ.44కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా కేవలం రూ.15కోట్లతో రూపొందగా, ఇప్పుడు 17 రెట్లు వసూళు చేసింది. లాభాల పంట పండిస్తోంది.

55
విష్ణు అవతారం నరసింహ కథతో రూపొందిన `మహావతార్‌ నరసింహ`

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన `మహావతార్ నరసింహ` చిత్రాన్ని క్లీమ్‌ ప్రొడక్షన్‌ నిర్మించింది. హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది. జులై 25న విడుదలైన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌పై అల్లు అరవింద్‌ విడుదల చేశారు. విష్ణువు అవతారాల్లో ఒకటై నరసింహ అవతారం ప్రధానంగా చేసుకుని, ఆయన భక్తుడు ప్రహ్లాద కథ నేపథ్యంలో ఈ యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందించారు. ఇండియాలోనే యానిమేషన్‌లో ఇంత క్వాలిటీతో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories