`వార్ 2` ఐదు రోజుల కలెక్షన్లు.. 5 బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ మూవీ

Published : Aug 19, 2025, 06:43 PM IST

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ కలిసి నటించిన `వార్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. కానీ ఇది 5 రోజుల్లోనే 5 కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది.  

PREV
15
ఐదు సినిమా రికార్డులు బ్రేక్‌ చేసిన `వార్‌ 2`

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ కలిసి నటించిన `వార్ 2`  సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోని 3 సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. `ఈక్ థా టైగర్`, `టైగర్ జిందా హై`, `టైగర్ 3` సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.  

DID YOU KNOW ?
`వార్‌ 2` 5 రోజుల కలెక్షన్లు
`వార్‌ 2` మూవీ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.281 కోట్లు కలెక్ట్ చేసింది.
25
`ఛావా` ఫస్ట్ డే రికార్డు బ్రేక్‌ చేసిన `వార్‌ 2`

`వార్‌ 2` బాలీవుడ్‌లో మరో రికార్డు క్రియేట్‌ చేసింది. ఇది 2025 లో విడుదలైన విక్కీ కౌశల్ నటించిన `ఛావా` సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. `ఛావా` సినిమా మొదటి రోజు రూ.33.10 కోట్లు వసూలు చేయగా, `వార్ 2` ఫస్ట్ డే రూ.52.5 కోట్లు వసూలు చేసింది. 

35
`వార్‌` కలెక్షన్లని దాటేసిన `వార్‌ 2`

`వార్ 2` సినిమాతో హృతిక్ రోషన్ కి, తారక్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. 2019 లో వచ్చిన `వార్` సినిమా కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. 

45
`బ్రహ్మాస్త్ర` రికార్డులు బ్రేక్‌ చేసిన `వార్‌ 2`

దర్శకుడు అయాన్ ముఖర్జీ కి `వార్ 2` సినిమా లక్కీగా మారింది. ఆయన దర్శకత్వం వహించిన `బ్రహ్మాస్త్ర` కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. 

55
`గేమ్‌ ఛేంజర్‌` కన్నా ఎక్కువ కలెక్షన్లు

`వార్ 2` సినిమా కియారా అద్వానీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆమె నటించిన `గేమ్ ఛేంజర్` సినిమా కన్నా ఇది ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. `వార్ 2` సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు 183.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో ఏకంగా రూ.281కోట్లు రాబట్టింది. ఐదో రోజు ఇది పది కోట్ల వరకు వసూళు చేయడం విశేషం.  అయితే చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం రూ.300కోట్లు రాబట్టినట్టు ప్రకటించడం గమనార్హం.  ఈ మూవీ రూ.700కోట్ల గ్రాస్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది.  మరి అంత వరకు వెళ్తుందా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories