దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. రెండు పీరియడ్ కాలాల్లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. గతం తాలూకు ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.
ఇందులో విజయ్ స్పైగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో అన్నా సెంటిమెంట్ హైలైట్‌గా నిలుస్తోందని టాక్. ఇవే ఇందులో హైలైట్‌గా ఉంటాయట.
ఇప్పటికే విడుదలైన పాటలు ఆద్యంతం అలరించాయి. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన `అన్నా` సాంగ్ సైతం ఎమోషనల్‌గా అలరించింది. బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి.