ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు మల్టిప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా AAA సినిమాస్ పేరుతో సొంతంగా మల్టీప్లెక్స్ నిర్మించుకున్నారు. కొందరు దర్శకులు, నిర్మాతలకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ మరో అగ్ర హీరో తన మల్టిప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు.
25
మహేష్, అల్లు అర్జున్ తర్వాత రవితేజ
ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ఏషియన్ సినిమాస్, మాస్ మహారాజా రవితేజ కలిసి నిర్మించిన నూతన మల్టీప్లెక్స్ ఏఆర్టీ సినిమాస్ (Asian Ravi Teja Cinemas - ART Cinemas) జూలై 2025లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇటీవల 'కుబేరా' ప్రమోషన్ సమయంలో పంపిణీదారుడు, నిర్మాత అయిన సునీల్ నారంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. హైదరాబాద్‌లో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కావడంపై సినీ ప్రేమికుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
35
పవన్ సినిమాతో రవితేజ థియేటర్ ప్రారంభం
ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం హరి హర వీర మల్లు: పార్ట్ 1 మూవీతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజకి చెందిన మల్టీప్లెక్స్ లో తొలి చిత్రం గా పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ప్రదర్శించబడుతుండడంతో టాలీవుడ్ లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చారిత్రక యాక్షన్ డ్రామా 2025 జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ థియేటర్‌లో వీర మల్లు గాథను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ART సినిమాస్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 57 అడుగుల భారీ EPIQ స్క్రీన్, 4K ప్రొజెక్షన్, డాల్బీ Atmos సౌండ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమా అనుభూతిని కలిగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. హైదరాబాద్‌లో సినిమా ప్రదర్శనకు ఇది కొత్త ప్రమాణాల్ని సృష్టించనుందని అంచనా.
55
హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు
ప్రారంభ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ థియేటర్ ఓపెనింగ్ రోజున సునీల్ నారంగ్ మరిన్ని ఆశ్చర్యకర విషయాలు రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పవన్ సినిమాతో రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం అనేది క్రేజీ విషయం. పవన్, రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.