అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు కలిసి నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. తన తండ్రి చివరి చిత్రం కావడంతో నాగార్జున ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఈ మూవీలో శ్రియ శరన్, సమంత హీరోయిన్లుగా నటించారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు హర్షవర్ధన్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రానికి రచన అందించే అవకాశం తనకు చాలా డ్రమాటిక్ గా దక్కిందని హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ టైంలో నేను గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం చేస్తున్నాను. అంతకుముందు విక్రమ్ కుమార్ తో ఇష్క్ చిత్రానికి వర్క్ చేశాను. దీంతో విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా నన్నే రచయితగా తీసుకున్నారు.