దిల్ రాజు కంటే ముందు చాలా మంది సెలెబ్రిటీలని కలిశా, ఆయనతో పెళ్లి కోసం పెద్ద యుద్ధమే జరిగింది.. తేజస్విని

Published : Jun 29, 2025, 07:49 AM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ల క్రితం తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు తేజస్వినితో దిల్ రాజు పరిచయం ఎలా జరిగింది, ఎలా పెళ్లి వరకు వెళ్లారు అనే విషయాన్ని తేజస్విని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

PREV
15
దిల్ రాజు రెండో వివాహం

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ల క్రితం తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత దిల్ రాజు కొంతకాలం సింగిల్ గా ఉన్నారు. ఆ తర్వాత తేజస్వినితో పరిచయం కావడం, ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది.

25
దిల్ రాజు ఎవరో తెలియదు

అసలు తేజస్వినితో దిల్ రాజు పరిచయం ఎలా జరిగింది, ఎలా పెళ్లి వరకు వెళ్లారు అనే విషయాన్ని తేజస్విని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. వాస్తవానికి నాకు సినిమాలు గురించి పెద్దగా తెలియదు. మా ఫ్యామిలీ ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చూసేవాళ్ళం.. అది కూడా దసరాకి మాత్రమే అని తేజస్విని తెలిపారు. కానీ అనుకోకుండా నాకు సినిమా వ్యక్తితోనే పరిచయం ఏర్పడింది. మొదట్లో దిల్ రాజు ఎవరో నాకు తెలియదు.

35
ఆయనకి ఆల్రెడీ పెళ్లయింది అని తెలిసినప్పుడు..

సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత దిల్ రాజు అంటే డైరెక్టర్ ఏమో అని అనుకున్నా. కానీ ఆ తర్వాత గూగుల్ చేసి చూస్తే ప్రొడ్యూసర్ అని తెలిసింది. ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయింది అని తెలిసింది. దీంతో దిల్  రాజు గారితో జర్నీ వద్దులే అనుకున్నా. వెనకడుగు వేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనతోనే జర్నీ చేయాలని నిర్ణయించుకున్నా. అంతకుముందు నేను ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలను మీట్ అయ్యాను. కానీ అనుకోకుండా దిల్ రాజు తోనే నా జర్నీ మొదలైంది.

45
నేను వాళ్ళ దగ్గరే పెరిగాను

అసలు మేము పెళ్లి వరకు వెళ్తామని నేను అనుకోలేదు. మా ఇద్దరి జర్నీ అంత సులభంగా జరగలేదు. నేను మా గ్రాండ్ పేరెంట్స్, పెద్దమామయ్య దగ్గరే పెరిగాను. కాబట్టి నా విషయంలో డెసిషన్ వాళ్లదే. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని కన్విన్స్ చేయాలి అని దిల్ రాజుగారు నన్ను అడిగారు. అప్పుడు నేను మా పెద్ద మామయ్య గురించి చెప్పాను. ఆయన మా ఫ్యామిలీకి హిట్లర్ లాంటివారు. ఆయనతోపాటు మా పిన్నిని కూడా ఒప్పించాలని చెప్పాను.

55
కుటుంబ సభ్యులని ఒప్పించి దిల్ రాజుతో వివాహం 

కానీ ఊహించని విధంగా మా పెద్దమామయ్య అంగీకరించారు. కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవ్వరూ అస్సలు ఒప్పుకోలేదు. నువ్విలా చేయడానికి వీలు లేదు అని తెలిపారు. కష్టం మీద చివరికి వాళ్ళని ఒప్పించడం జరిగింది. ఆ విధంగా దిల్ రాజు గారితో నా వివాహం జరిగిందని తేజస్విని తెలిపారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు సంతానం.

Read more Photos on
click me!

Recommended Stories