అది చేయడం నచ్చకే కెరీర్ లో వెనుకబడ్డా.. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్లు ఇచ్చిన హీరోయిన్

Published : Jan 29, 2026, 04:30 PM IST

Bhumika Chawla: పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భారీ హిట్స్ ఇచ్చిన ఓ హీరోయిన్ తాను కెరీర్ లో వెనుకబడడానికి సంచలన కారణం చెప్పారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
హీరోయిన్ భూమిక 

టాలీవుడ్ లో అందంతో పాటు నటనలో కూడా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లు కొంతమందే ఉంటారు. అందం, నటనలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు విజయాలు కూడా దక్కితే అలాంటి హీరోయిన్లకు ఇక తిరుగు ఉండదు. ఆ కోవకు చెందిన హీరోయిన్లలో భూమిక ఒకరు. భూమిక చావ్లా టాలీవుడ్ లో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా రాణించారు. 

25
స్టార్ హీరోలతో సినిమాలు 

ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. భూమిక తన కెరీర్ లో పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో నటించారు. పవన్ కళ్యాణ్ తో నటించిన ఖుషి, మహేష్ తో నటించిన ఒక్కడు, ఎన్టీఆర్ తో నటించిన సింహాద్రి చిత్రాలు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాగని ఆమె ఆ చిత్రాల్లో కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితమైన పాత్రల్లో నటించలేదు. హీరోలతో పాటు నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రల్లో నటించింది. 

35
క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న భూమిక 

అంత అద్భుతమైన సినిమాల్లో నటించిన నటి ఇంకా ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగుతుంది అని అంతా భావించారు. కానీ భూమికకి క్రమంగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి పరిమితమైంది. 

45
హీరోయిన్ గా వెనుకబడడానికి కారణం ఇదే 

ఇలా ఎందుకు జరిగిందో భూమిక ఓ ఇంటర్వ్యూలో వివరించారు. భూమిక మాట్లాడుతూ.. నాకు చాలా కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అన్నీ స్టార్ హీరోల సినిమాలే. కాకపోతే ఆ సినిమాల్లో నావి కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితమైన పాత్రలు. నా పాత్ర పరిధి తక్కువ. సాంగ్స్ లో కనిపిస్తే చాలు. అలాంటి ఆఫర్స్ వచ్చాయి. కానీ అలాంటి సినిమాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ రిజెక్ట్ చేశాను. 

55
యుఫోరియా మూవీలో..

దీనితో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అలాగే కొనసాగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశా. ఆ విధంగా హీరోయిన్ గా ఆఫర్స్ కోల్పోయినట్లు భూమిక పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిక గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యుఫోరియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories