డివోర్స్ రూమర్స్ వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..కొత్త పాఠాలు నేర్చుకున్నా అంటూ..

Published : Aug 11, 2025, 08:07 PM IST

గత కొంతకాలంగా హన్సిక విడాకుల రూమర్స్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. తాజాగా హన్సిక సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. 

PREV
15
హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్

నటి హన్సిక మోత్వాని శనివారం రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భర్త సోహైల్ ఖతూరియాతో విడాకుల పుకార్లు వినిపిస్తున్న వేళ, హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్రౌండ్ లో సముద్రం ఫోటోపై భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

DID YOU KNOW ?
టీనేజ్ లోనే హీరోయిన్ గా హన్సిక 
హన్సిక 16 ఏళ్ళ టీనేజ్ లోనే దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో హన్సిక నటించింది. హన్సికని ఫ్యాన్స్ యాపిల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. 
25
కొత్త పాఠాలు నేర్చుకున్నా 

హన్సిక తన పోస్ట్ లో ఇలా పేర్కొంది. “మీరు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలతో నా హృదయం ప్రేమతో నిండిపోయింది. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ సంవత్సరం నేను అందగకుండానే కొత్త పాఠాలు నేర్పింది. నాలో ఉన్న నాకు తెలియని శక్తిని తెలిసేలా చేసింది. హృదయం నిండింది, ప్రశాంతంగా ఉంది” అని పేర్కొన్నారు.

35
పెళ్లి ఫోటోలు డిలీట్ 

ఈ పోస్ట్ పెట్టే ముందు కొన్ని రోజులకే, హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త సోహైల్‌తో ఉన్న పెళ్లి ఫోటోలు, వీడియోలను తొలగించారు.  మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, వివాహం జరిగి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం.

45
హన్సిక, సోహైల్ మధ్య విభేదాలు 

హన్సిక తన తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. సోహైల్ తన తల్లిదండ్రులతో ఉంటున్నారు. 2022 డిసెంబరులో వివాహం జరిగినప్పుడు మొదట ఇద్దరూ సోహైల్ కుటుంబంతోనే ఉన్నారు. కానీ పెద్ద కుటుంబంలో కలిసి ఉండడంలో సమస్యలు రావడంతో, అదే భవనంలో ఒక ఫ్లాట్‌కి మారారు. కానీ వీరి మధ్య సమస్యలు మాత్రం పెరిగాయట. హన్సిక ఈ విషయంపై స్పందించకపోయినా, సోహైల్ మాత్రం “ఇది నిజం కాదు” అని మూడు మాటల్లో ఖండించారు.

55
సోహైల్ కి ఇది రెండో వివాహం 

హన్సిక మోత్వాని, సోహైల్ ఖతూరియా 2022 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకథను హన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో ఆరు ఎపిసోడ్‌ల రియాలిటీ సిరీస్‌గా తీశారు. ఇది 2023 ఫిబ్రవరిలో జియోసినిమా ద్వారా విడుదలైంది. ఈ సిరీస్‌లో ఐఫిల్ టవర్ కింద ప్రపోజల్‌ నుండి, గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల వరకు అన్ని ముఖ్యమైన క్షణాలను చూపించారు. సోహైల్‌కు ఇది రెండో వివాహం కాగా, ఆయన మాజీ భార్య పేరు రింకీ బజాజ్.

Read more Photos on
click me!

Recommended Stories