మంచి హర్రర్ మూవీ కోసం వెతుకుతున్నారా? అయితే ‘28 ఇయర్స్ లేటర్’ సినిమాను చూసేందుకు ప్రయత్నించండి. చిన్న సినిమాగా విడుదలై భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
మంచి హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లు కలిసిన సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే ‘28 ఇయర్స్ లేటర్’ మూవీ చూసేందుకు ప్రయత్నించండి. అయితే ఈ సినిమా చూసే ముందు ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. దీనిలో రక్తపాతం, హింస ఎక్కువగానే ఉంటుంది. అలాగే థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఎక్కువే. 28 ఇయర్స్ లేటర్ సినిమా అనేది... 28 డేస్ లేటర్ మూవీకి సీక్వెల్. హాలీవుడ్ హారర్ ఇండస్ట్రీకి ఎంతో నచ్చిన సినిమా ఇది. హాలీవుడ్లో జూన్ 20న విడుదలై ఎంతో మందికి నచ్చింది. దీన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేశారు.
25
28 ఇయర్స్ లేటర్ స్టోరీ ఇదే
2002 నుంచి కథ మొదలవుతుంది. ఆ సంవత్సరంలో వచ్చిన రేజ్ వైరస్ నియంత్రణలోకి వస్తుంది. ఆ తర్వాత 28 సంవత్సరాలకు తర్వాత ఏమైందనేది ఈ స్టోరీలో చూపిస్తారు. బ్రిటన్ లో ఉన్న ఒక దీవిలో కొంతమంది ఆ వైరస్ బారి నుంచి బయటపడి ప్రాణాలతో ఉంటారు. హీరో జామీ.. తన కొడుకు స్పైక్ తో కలిసి వేట కోసం బయలుదేరుతారు. వీరిద్దరూ ఈ సినిమాలోని కీలక వ్యక్తులు. తండ్రి కొడుకులే ఈ సినిమా హీరోలు.
35
విలన్ ను చూస్తే భయమేయడం ఖాయం
ఆ సమయంలో వారికి అక్కడ ఆల్ఫా అనే ఒక వైరస్ బారిన పడిన నాయకుడు ఎదురవుతాడు. అతడు చూసేందుకు ఎంతో భయానకంగా ఉంటాడు. వారిద్దరి మధ్య ఉత్కంఠభరిత సన్నివేశాలు సాగుతాయి. ఇది ఒక సైకిలాజికల్ హర్రర్ సినిమాలో చెప్పుకోవాలి. అందుకే మానసికంగా దృఢంగా ఉన్నవారే ఈ సినిమాను చూసేందుకు సిద్ధమవ్వండి. ఇందులో మానవ సంబంధాలు, భావోద్వేగాలు కూడా అధికంగానే ఉంటాయి.
45
20 ఐఫోన్ లతో షూటింగ్
ఐఎండిబి లో ఈ సినిమాకు 6.9 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా తీయడానికి 60 నుంచి 75 మిలియన్ల డాలర్ల ఖర్చయింది. ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసింది. కొన్ని కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలను 20 ఐఫోన్లతో చిత్రీకరించారు. పెద్ద కెమెరాలు పెట్టకుండా కేవలం ఐఫోన్లతో షూట్ చేసినా కూడా ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఐఫోన్లతో షూట్ చేయడం వల్ల విభిన్నమైన కొత్త లుక్ వచ్చిందని సినీ విమర్శకులు కూడా చెప్పారు. దీన్ని ఒక ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకోవాలని కామెంట్ చేశారు.
55
ఏ ఓటీటీలో చూడవచ్చు?
మీకు కూడా ఈ 28 ఇయర్స్ లేటర్ సినిమాను చూడాలనిపిస్తే అమెజాన్ ప్రైమ్ మీడియాలో సెర్చ్ చేయండి. అలాగే ఆపిల్ టీవీ ప్లస్, బుక్ మై షో స్ట్రీమింగ్ లో కూడా చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమా రెంటల్ పద్ధతిలోనే ఉంది. భవిష్యత్తులో ఇది ఫ్రీగా చూసే అవకాశం ఉంటుంది. మంచి హర్రర్ థ్రిల్లర్ సినిమా చూడాలని కోరుకునే వారు ఈ మూవీని ఎంపిక చేసుకోవచ్చు.