GV ప్రకాష్ - సైంధవికి విడాకులు మంజూరు చేసిన కోర్టు , మరి వారి పాప పరిస్థితి ఏంటి?

Published : Sep 30, 2025, 11:33 PM IST

 ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ , సైంధవిలకు కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి పాప పరిస్థితి ఏంటి? ఆమెను కోర్డ్ ఎవరికి ఇచ్చింది? 

PREV
15
జీవీ ప్రకాష్ - సైంధవి విడాకులు

సౌత్  సినిమాలోని ప్రముఖ సంగీత దర్శకుడు, యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్, తన స్కూల్ ఫ్రెండ్ అయిన  గాయని సైంధవిని పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

25
విడాకులు ఎందుకు?

జీవీ ప్రకాష్, సైంధవిల విడాకుల నిర్ణయం సినీ పరిశ్రమను, అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీనిపై సైంధవి, 'చాలా ఆలోచించాక, 11 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాం' అని గతంలోనే పోస్ట్ చేసింది.

35
సైంధవి - జీవీ పెట్టిన పోస్ట్:

ఈ వ్యక్తిగత మార్పు సమయంలో మా స్వేచ్ఛను గౌరవించాలని మీడియాను, స్నేహితులను కోరుతున్నాం. విడిపోవడం కష్టమే అయినా, ఇదే ఉత్తమ నిర్ణయం. మీ మద్దతు మాకు ముఖ్యం' అని సైంధవి పోస్ట్ చేసింది. ఇదే పోస్ట్‌ను జీవీ కూడా పంచుకున్నారు.

45
మళ్లీ కలవాలని

విడాకులు ప్రకటించాక కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. జీవీ తన సంగీతంలో సైంధవికి పాడే అవకాశం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారు కలవాలని కోరుకున్నారు. ఇది వారి పరస్పర గౌరవాన్ని చూపించింది.

55
అన్వి విషయంలో జీవీ తీసుకున్న నిర్ణయం:

ఇద్దరూ విడాకులకే కట్టుబడి, పరస్పర అంగీకారంతో కోర్టులో పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 30న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కూతురు అన్వి, సైంధవితో ఉండటానికి జీవీ ప్రకాష్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. దాంతో పాపను తల్లికి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories