దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే

Published : Jul 18, 2025, 07:43 AM ISTUpdated : Jul 18, 2025, 11:34 AM IST

తెలుగు లెజెండ్రీ నటుల్లో ఒకరైన గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె శారద చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండిపోయే గొప్ప సాయం చేశారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
సాయం చేయాలంటే ముందుండే చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో మాత్రమే కాదు.. ప్రజా సేవలో కూడా రాణించారు. బ్లడ్ బ్యాంక్, నేత్రదానం లాంటి గొప్ప కార్యక్రమాలని చిరంజీవి నడిపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తన సీనియర్ నటులపై చిరంజీవికి అపారమైన గౌరవం, అభిమానాలు ఉన్నాయి. టాలీవుడ్ లెజెండ్రీ నటుల్లో గుమ్మడి వెంకటేశ్వర రావు ఒకరు. 

25
గుమ్మడి పోషించిన పాత్రలు 

గుమ్మడి అప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చే వరకు నటించి మెప్పించారు. అనేక పౌరాణిక పాత్రలని కూడా గుమ్మడి అద్భుతంగా పోషించారు. బలరాముడిగా, భీష్ముడిగా, దశరథుడిగా, కర్ణుడిగా ఆయన నటించారు. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు సంతానం. 

35
చిరంజీవిపై గుమ్మడి కుమర్తె వ్యాఖ్యలు 

గుమ్మడి కుమార్తె గుమ్మడి శారద చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని, ఆయన తమ ఊరికి చేసిన సహాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గుమ్మడి శారద మాట్లాడుతూ.. మా ఊరిలో గుడి పాడైపోయింది. అది మా అమ్మగారి ముత్తాత కట్టించిన గుడి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ గుడి రోడ్డు కంటే బాగా కిందికి వెళ్ళిపోయింది. వర్షం నీరు చేరి భక్తులకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆ గుడిని బాగు చేయించాలని అమ్మా నాన్న ఎంతో ప్రయత్నించారు. 

45
అరగంటలో చిరంజీవి సాయం 

ఆ గుడిని బాగు చేయించడం అమ్మ చివరి కోరిక. కానీ అది నెరవేరకుండానే ఆమె మరణించారు. నాన్న కూడా ప్రయత్నించినప్పటికీ గుడిని బాగు చేయడం కుదర్లేదు. ఇటీవల కొన్నేళ్ల క్రితం తాను చిరంజీవి గారిని కలిశానని తెలిపారు. తమ ఊరిలో ఉన్న గుడి పరిస్థితి గురించి వివరించాను. అప్పటికే ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారు. ఏ పదవిలోనూ లేరు. నేను గుడి గురించి చెప్పగానే తన పలుకుబడి ఉపయోగించి కేవలం అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలించి నిధులు మంజూరు అయ్యేలా చేశారు. 

55
100 ఏళ్ళు గుర్తుండిపోతుంది 

ఆ నిధులతో మా ఊరిలో 100 ఏళ్ళు గుర్తుండిపోయేలా గుడి నిర్మాణం జరిగినట్లు శారద తెలిపారు. ఒక గుడికి ఆయుష్షు 100 ఏళ్ళు ఉంటుంది అంటారు. ఆ విధంగా తమ ఊరికి చిరంజీవి మరచిపోలేని సాయం చేశారు అని శారద అన్నారు. చిరంజీవి, గుమ్మడి కలిసి పసివాడి ప్రాణం, ముఠా మేస్త్రి, రక్త సంబంధం లాంటి చిత్రాల్లో నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories