Janaki Kalaganaledu: గోవిందరాజుకి మాట ఇచ్చిన జ్ఞానాంబ.. సంతోషంలో రామచంద్ర జానకి?

First Published Jan 24, 2023, 11:20 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 24వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర బాధపడుతూ ఉండగా అప్పుడు జానకి నిలబడిన చోటే ఉంటే మనిషికి కానీ కనిపిస్తాడు కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తేనే మనుషులు మధ్య దూరం తగ్గుతుంది అంటూ రామచంద్ర కు ధైర్యం చెబుతూ ఉంటుంది జానకి. ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటేనే బాగుంటుంది జానకి గారు కానీ అమ్మను నేను అలా చూడలేకపోతున్నాను అని అంటాడు. అత్తయ్య గారు మాట్లాడలేదని మీరు కూడా అలాగే ఉండకుండా ఏదో ఒక వంక పెట్టుకుని అత్తయ్య గారిని మాట్లాడిస్తూ ఉంటే అత్తయ్య గారు కూడా నీతో మాట్లాడతారు రామా గారు అంటుంది జానకి.
 

 అమ్మకి ఈ ఊర్లో గౌరవం ఉంది జానకి గారు ఇప్పటికిప్పుడు నోరు తెరిచి అడిగితే ఎంత కావాలి అన్న డబ్బులు ఇచ్చే వారు ఉన్నారు. కానీ అమ్మ అడగదు. నేను చేసిన పనికి ఇప్పటికే ఈ కుటుంబ పరువు పోయింది. ఆర్థికంగా మనం ఇంతకంటే ఎక్కువగా దిగజారితే మనకోసం అమ్మ ఆత్మాభిమానం ఎక్కడ చంపుకోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది జానకి గారు ఉంటాడు రామచంద్ర. ఆ పరిస్థితి మీరు ఎప్పటికీ రానివ్వరు ఆ నమ్మకం నాకుంది అని దైర్యం చెబుతుంది జానకి. అప్పుడు రామచంద్రని నవ్వండి సార్ అంటూ చెక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తుంది జానకి. అది చూసి గోవిందరాజులు సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత గోవిందరాజులు ఒకచోట కూర్చుని జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది.
 

 ఏంటండీ పొద్దునకి భోగి పండుగ ఉంది ఇంకా పడుకోలేదు నిద్రపోండి అనడంతో మన పెళ్లయి ఇన్ని రోజులు అయింది ఎప్పుడూ నువ్వు చేసింది తప్పు అని నాకు అనిపించలేదు కానీ తెలిసి తెలిసి ఒక తప్పు చేస్తున్నారు అది నీకు అర్థం కావడం లేదు జ్ఞానం అనడంతో దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగా రామ గురించి అంటాడు గోవిందరాజు. నువ్వు మాట్లాడకపోయే సరికి రామ బాధపడుతున్నాడు. దగ్గరికి తీసుకొని ఓదార్చాల్సిన నువ్వే ఇలా బాధపెడుతుంటే ఎలా జ్ఞానం అని అంటాడు. కనీసం పండక్కి తెచ్చిన బట్టలు కూడా నీ చేతిలో ఇవ్వలేదు. రాముడు ఎంత బాధ పడి ఉంటాడు నువ్వు ఇలా ఉంటే రాముడికి ఇంకా నరకంగా ఉంటుంది అని అంటాడు.
 

అందుకే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి జ్ఞానం అని అంటాడు. ఏంటండి రేపు పండగ రోజు నువ్వు నవ్వుతూనే అందర్నీ పలకరించాలి నవ్వుతూనే ఉండాలి బాధపడకూడదు. నేను పెళ్లయిన తర్వాత నేను ఎప్పుడూ నాకు ఇది కావాలి అని అడగలేదు మొదటిసారి అడుగుతున్నాను నాకు మాట ఇవ్వు జ్ఞానం అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు జ్ఞానాంబ గోవిందరాజులకి మాట ఇస్తూ సరే అండి మీ ఇష్టం అని అంటుంది. ఆ తర్వాత ఉదయం రామచంద్ర, జానకి భోగిమంటలు వేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరిని నిద్ర లేపడానికి వెళ్తారు. అప్పుడు గోవిందరాజులు నిద్ర లేచి వెన్నులను భోగిమంట దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. ఆ తర్వాత జానకి డోర్ కొడుతున్నా కూడా మల్లిక మజ్జుగా అలాగే పడుకుని ఉంటుంది.
 

అప్పుడు నాకు ఓపిక లేదు జానకి నువ్వు వెళ్ళు అని మల్లిక చెప్పిన వినిపించుకోకుండా మల్లికను అక్కడికి పిలుచుకొని వెళుతుంది జానకి. ఇంతలోనే రామ,విష్ణును భోగి మంటలు దగ్గరికి బలవంతంగా పిలుచుకొని వెళ్తాడు. అందరం వచ్చాము అత్తయ్య గారు రాలేదు అనడంతో అదిగో వస్తుందమ్మా అంటాడు గోవిందరాజులు. తర్వాత జ్ఞానాంబ నవ్వుకుంటూ అక్కడికి వచ్చి శుభాకాంక్షలు చెప్పడంతో ఈవిడ ఏంటి ఇంత సంతోషంగా అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతోంది అనుకుంటూ ఉంటుంది మల్లిక. అప్పుడు జానకి అత్తయ్య గారు మీ చేత్తో బోగి వెలిగించండి అనడంతో జ్ఞానాంబ నవ్వుతూ భోగిమంట వెలిగిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోగిమంట కాపు కుంటూ ఉండగా ఇంతలో రామచంద్ర భోగిమంటలో పడబోతుండడంతో జ్ఞానాంబ రామచంద్రాన్ని పట్టుకొని జాగ్రత్త రామా అని అంటుంది.
 

 అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. దాంతో జానకి రామచంద్ర ఇద్దరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత జానకి రామచంద్ర కుంకుడుకాయతో స్నానం చేపిస్తూ ఉంటుంది. మల్లికకూడా విష్ణుకు స్నానం చేయిస్తూ ఉండగా మల్లిక వద్దు మల్లిక అనడంతో అదేం కుదరదు చేయించుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడు విష్ణు చిన్న పిల్లవాడిలా అరుస్తూ ఉండగా ఏంటి విష్ణు అలా అరుస్తున్నావు అని అంటుంది జ్ఞానాంబ. అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు అబ్బా మంట అంటూ విష్ణు అల్లరి చేస్తూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఒరేయ్ విష్ణు ఏంటి అలా అరుస్తున్నావు ఊర్లో జనాలు చూస్తే మన ఇంట్లో ఏమైనా అయింది అనుకుంటారు. సైలెంట్ గా స్నానం చేయించుకో అని అంటుంది జ్ఞానాంబ.
 

స్నానం చేయిస్తూ ఉండగా రామచంద్ర, విష్ణు ఒకరికొకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత రామచంద్ర కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతూ ఉండగా ఇంతలోనే జానకి అక్కడికి వస్తుంది. ఈ మధ్యకాలంలో మా ఆయన ముఖంలో నేను అంత వెలుగు చూడలేదు ఎందుకో ఆనందం అని అడగడంతో రామచంద్ర సిగ్గుపడుతూ అమ్మ నాకు చాలా రోజుల తర్వాత ప్రేమగా మాట్లాడింది నన్ను రామఅని ప్రేమగా పిలిచింది అని చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు రామచంద్ర. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!