మత్తు చూపులు.. మత్తెక్కించే పోజులు.. కుర్ర గుండెల్ని దోచుకుంటున్న ‘ధమాకా’ బ్యూటీ!

First Published | Jan 24, 2023, 11:12 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ అదే స్థాయిలో క్రేజ్ దక్కించుకుంటోంది. మరోవైపు నెట్టింటా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.
 

‘ధమాకా’ బ్యూటీ, కుర్ర హీరోయిన్ శ్రీలీలా టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ‘పెళ్లి సందడి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతోంది. 
 

బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందుకుంటున్న శ్రీలీలాకు అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలా ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 


తన అభిమానులను ఖుషీ చేసేందుకు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. ఈ సందర్భంగా అట్రాక్టివ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. మత్తు పోజులతో మంత్రముగ్ధులను చేస్తోంది.
 

తాజాగా శ్రీలీలా పంచుకున్న ఫొటోలు కుర్రాళ్ల చూపులను కట్టిపడేస్తున్నాయి. గ్రీన్ చుడీదార్ లో మెరిసిన ఈ బ్యూటీ క్లోజ్ షాట్ లో మతిపోగొడుతోంది. మత్తుచూపులు, మైకం తెప్పించే పోజులతో యువత గుండెల్ని కొల్లగొడుతోంది. 

తక్కువ సమయంలోనే నెట్టింటా ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఇప్పటికే ఇన్ స్టాలో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఈ సంఖ్య మరికొద్దిరోజుల్లోనే రెట్టింపు కానుందని తెలుస్తోంది. శ్రీలీలా ఎలాంటి పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. లక్షల్లో లైక్స్ కూడా వస్తున్నాయి. 
 

రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ సరసన ‘ధమాకా’లో నటించింది. చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడం శ్రీలీలా కేరీర్ ను మలుపు తిప్పింది. ప్రస్తుతం బాలయ్య108, ఎస్ఎస్ఎంబీ28, మరో రెండు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Latest Videos

click me!