Janaki Kalaganaledu: కొడుకులను తలుచుకుని బాధపడుతున్న గోవిందరాజులు.. జానకిని చూసి సంతోషపడుతున్న జ్ఞానాంబ?

First Published Jan 31, 2023, 10:26 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 31వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు రామచంద్ర కు తెలిసిన ఒక అతను అక్కడికి వచ్చి అష్టలక్ష్మిలలో అన్ని లక్ష్మీలను మరిచిపోయిన ధైర్య లక్ష్మిని మాత్రం మర్చిపోకూడదని అంటారు.. మొదట మీ పరిస్థితిని బాధ వేసింది తర్వాత మీ భార్య మాటలు విని ధైర్యం వచ్చింది అనడంతో రామచంద్ర జానకి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రామచంద్ర స్వీట్లు ఇవ్వడంతో అవి తిని పొగుడుతూ ఉండగా రామచంద్ర, జానకి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జానకి వాళ్ళ మాటలే మనకు పునాది అనడంతో రామచంద్ర 20 లక్షలు ఎలా తీర్చాలో జానకి గారు అనగా అప్పుడు జానకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ పని చేసుకుంటూ ఉండగా అప్పుడు సమయం కావడంతో వెన్నెలను పిలిచి మీ నాన్నకు టాబ్లెట్స్ ఇవ్వు అని చెబుతుంది.
 

 అప్పుడు టాబ్లెట్స్ అయిపోవడంతో వెన్నెల నేను వెళ్లి తీసుకు వస్తాను అనగా మరి డబ్బులు అని గోవిందరాజులు అడగడంతో అన్నయ్య బండి దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుంటాను అని అంటుంది వెన్నెల. అప్పుడు వెంటనే జ్ఞానాంబ వద్దమ్మా అని అంటుంది. ఎందుకమ్మా అనడంతో వెంటనే గోవిందరాజులు మీ అమ్మ వద్దు అని కారణం ఉంటుంది వెన్నెల అని అంటాడు. అప్పుడు వెన్నెల విష్ణుని డబ్బులు అడుగుతాను అనగా వద్దమ్మా అడిగిన లాభం ఉండదు. ఇంట్లో రామచంద్ర జానకి బాధ్యతగా నడుచుకున్నట్టుగా ఇంతవరకు విష్ణు అఖిల్ నడుచుకోలేదు అని బాధగా మాట్లాడుతాడు. నువ్వు వెళ్లి అడిగినా కూడా పెద్దన్నయ్య ఉన్నాడు కదా అనే సమాధానమే వస్తుంది అనడంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.
 

పేరుకే కొడుకులు ప్రయోజనం లేకుండా ఉన్నారు అని అనగా మరి మందులు ఎలా నాన్న అనడంతో ఒక పూట మింగకపోతే ప్రాణాలు ఏమి పోవులే అని అంటాడు. ఏంటండీ ఆ మాటలు అనగా బయటకు వెళ్లినప్పుడు నీకేంటయ్యా ముగ్గురు కొడుకులు మహారాజులా చూసుకుంటారు అనడంతో నిజమే అనుకునేవాడిని కానీ ఇప్పుడు తెలుస్తోంది జ్ఞానం అని అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అనగా వారి కష్టానికి మనం అండగా ఉండాలి కానీ భారం కాకూడదు అని అంటాడు. మరొక రేపు జానకి స్వీట్ బండి దగ్గర రామచంద్ర వ్యాపారం చేస్తుండగా జానకి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు కస్టమర్స్ వచ్చి బిల్ ఎంత అయింది అని అడగడంతో రామచంద్ర చెప్పడానికి తడబడుతూ ఉండగా జానకి ఇంత డబ్బులు అయింది అని చెప్పగా వాళ్ళు వెళ్లిపోవడంతో అలా ఎలా చెప్పారు జానకి గారు అని అడుగుతాడు రామచంద్ర.
 

అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జానకి రామచంద్ర భుజంపై తల పెట్టుకొని మీరు బంగారం నన్ను బాగా అర్థం చేసుకుంటారు అని ప్రేమగా మాట్లాడుతుంది. ప్రతి భార్య భర్తను అర్థం చేసుకోవాలని చూస్తుంది. భార్యను అర్థం చేసుకునే భర్త చాలా తక్కువ రామారావు గారు. మీలాంటి భర్త దొరికితే ఆ అమ్మాయి అడవిలో ఉన్న అంతపురంలో ఉన్నట్టే అని అంటుంది. అప్పుడు వారిద్దరూ ప్రేమగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత డబ్బులు లెక్కపెట్టుకొని ఇంటికి వెళ్తారు. మరొకవైపు ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు వెన్నెల జానకి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
 

అప్పుడు మల్లిక నాటకాలు ఆడుతూ రా వెన్నెలా వచ్చి తిందువు అనడంతో పర్లేదు వదిన మీరు తినండి అని అంటుంది. రామచంద్ర వాళ్ళు రావడంతో ఏంటి రామ ఇంత లేట్ అయింది అనగా వ్యాపారం ఉంది నాన్న అమ్మ ఇదిగో ఈ రోజు సంపాదన అని అంటాడు రామచంద్ర. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. గోవిందరాజులు సంపాదన లేని వాళ్ళు టయానికి తింటుంటే సంపాదించేవాడు కడుపు మార్చుకుంటున్నాడు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రామచంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆగు రామ నీ తొలి సంపాదన ఇవ్వాల్సింది నాకు కాదు నీ భార్య జానకి కి తీసుకో జానకి వెనడంతో మల్లిక ప్రేమ లేనట్లే ఉంటారు అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి డబ్బులు తీసుకుని నాకు ఇవ్వాలని ఏమీ లేదు రామచంద్ర గారు ఈ ఇంటీ ఆడపడుచుకుంది కదా.

వెన్నెల ఇదిగ డబ్బులు తీసుకో మావయ్యకు ఎలాగో మెడిసిన్ తీసుకోవాలి కదా అని వెన్నెల చేతిలో డబ్బులు పెడుతుంది జానకి. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. అఖిల్ మాత్రం నన్ను చేతగాని వాడిని చేస్తోంది మా వదిన అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా జానకి ఒకవైపు వంట చేస్తూ మరోవైపు చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు వెన్నెల వదిన ఒకవైపు వంట చేస్తూ చదువుకుంటూ అన్నయ్యకు తోడుగా ఉంటుంది వదినను చూస్తే నాకు జాలిగా ఉంది నాన్న అని అంటుంది. అప్పుడు గోవిందరాజులు జానకిని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞానాంబ మాత్రం మౌనంగా ఉంటుంది. అప్పుడు అత్తయ్య నేను క్యారేజ్ ఇచ్చొస్తాను అనగా సరే అనగా అప్పుడు జానకి వెళుతుండగా అప్పుడు గోవిందరాజులు ఒక్కదానివే ఎందుకు కష్టపడుతున్నావు జానకి.

వెన్నెల సహాయం తీసుకోవచ్చు కదా అనగా ఆడపడుచుని కష్టపెడితే బాగుండదు మామయ్య ఎలాగో తాను తన అత్తగారింట్లో కష్టపడాలి కదా అని మంచిగా మాట్లాడుతుంది జానకి. అప్పుడు గోవిందరాజులు మీ అత్తయ్య గారు మీకు ఆశీర్వాదం ఇవ్వలేదు కదా బాధగా లేదా అనడంతో అత్తయ్య గారి చల్లని చూపులు చాలు మామయ్య మాకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఆ తర్వాత జానకి రోడ్డుపై నడుచుకుంటూ రామచంద్రకి భోజనం తీసుకొని వెళ్తూ ఉంటుంది.

click me!