Deepthi Sunaina
దీప్తి తన లేటెస్ట్ ఫోటో షూట్ లో భుజం ఉన్న టాటూ రివీల్ చేసింది. హగ్ సింబల్ కూడిన సదరు టాటూ చాలా సెక్సీగా ఉంది. దీంతో కుర్రాళ్ళు వెర్రెత్తి పోతున్నారు. దీప్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Deepthi Sunaina
కాగా ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరు మళ్ళీ కలిసిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కలిసి ఈవెంట్స్ చేస్తున్న ఈ జంట ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. దీప్తికి షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో ఇద్దరికీ అవగాహన కుదిరిందని గట్టిగా వినిపిస్తోంది.
Deepthi Sunaina
దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి కారణాలు పరిశీలిస్తే... బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
Deepthi Sunaina
బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. షణ్ముఖ్ తో బ్రేకప్ బాధ నుండి బయటపడటం కోసం విహారాలు చేసింది.
Deepthi Sunaina
కాగా దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి చెప్పడం విశేషం. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.
Deepthi Sunaina
యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునయన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైన గ్లామర్.. తనీష్ తో రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచాయి.
ప్రస్తుతం దీప్తి షణ్ముఖ్ లేకుండా స్పెషల్ సాంగ్స్, సిరీస్లు చేస్తున్నారు. త్వరలో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. వీరి ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు.