ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జెస్సి తల్లిదండ్రులు, జెస్సి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అని జానకికి ఫోన్ చేసి చెప్తారు. జానకి భయపడి అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ మేడం, ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అని అడుగుతారు. ఇంపార్టెంట్ మేడం,పరీక్ష రాసే పరిస్థితుల్లో నేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. వెంటనే జానకి జెస్సి వాళ్ళ ఇంటికి వచ్చి,జెస్సి దగ్గరికి వెళ్లి ఓదార్చుతుంది. నేను మా ఇంట్లో వాళ్లతో మాట్లాడుతాను అని చెప్పాను కదా.